IND vs ENG 4th Test: గిల్, జురెల్ అదుర్స్.. 10 ఏళ్ళ తర్వాత భారత్ తొలి టెస్ట్ విజయం

IND vs ENG 4th Test: గిల్, జురెల్ అదుర్స్.. 10 ఏళ్ళ తర్వాత భారత్ తొలి టెస్ట్ విజయం

ఇంగ్లాండ్ తో రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. అసలే స్వల్ప లక్ష్యం.. వికెట్ కోల్పోకుండా 80 పరుగులు.. మరో 112 పరుగులు చేస్తే విజయం సిరీస్ గెలుపు. ఈ దశలో భారత్ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. స్పిన్నర్లు బషీర్, హర్టీలి,రూట్ చెలరేగడంతో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత యంగ్ స్టార్స్ గిల్, జురెల్ గొప్ప ఆట తీరును ప్రదర్శించారు. పిచ్ కష్టంగా ఉన్నా సరే ఓపిగ్గా ఆడారు. 

చెత్త షాట్ లు ఆడకుండా విజయం అందించే వరకు క్రీజ్ లో ఉండి పట్టుదలను చూపించారు. తొలి ఇన్నింగ్స్ లో సైతం వీరిద్దరూ కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడారు. భారత్ లోని స్పిన్ పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో ఛేజ్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలన్నా.. కఠినంగానే ఉంటుంది. చివరిసారిగా 2013లో భారత్ ఆస్ట్రేలియాపై ఢిల్లీ టెస్టులో 155 పరుగులను ఛేజ్ చేశారు. తాజాగా 192 పరుగుల భాగస్వామ్యాన్ని ఛేజ్ చేయడంతో ఈ పదేళ్ల రికార్డ్ కు బ్రేక్ పడింది. 

ఈ మ్యాచ్ లో భారత్ 5 వికెట్ల తేడాతో సిరీస్ గెలిచింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ(55) వికెట్ కీపర్ జురెల్(39)  అర్ధ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. వికెట్ కీపర్ జురెల్(39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..రూట్ (121) సెంచరీతో 353 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ జురెల్ 90 పరుగులతో రాణించడంతో 307 పరుగులకు ఆలౌటైంది.

ALSO READ :- IND vs ENG 4th Test: ఇంగ్లాండ్‌పై భారత్ ఉత్కంఠ విజయం ..3-1 తో సిరీస్ కైవసం

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేజ్ చేసింది.ఈ మ్యాచ్ తో ధర్మశాలలో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ సిరీస్ గెలుచుకుంది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత వరుసగా వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో వరుస విజయాలు సాధించింది.