
మస్కట్: మణిందర్ సింగ్ నాలుగు గోల్స్‌తో విజృంభించడంతో ఎఫ్‌ఐహెచ్ హాకీ ఫైవ్స్ మెన్స్ వరల్డ్ కప్‌లో ఇండియా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పూల్ చివరి, ఆఖరి మ్యాచ్‌లో ఇండియా 13-–0తో జమైకాను చిత్తు చేసి నాకౌట్ చేరుకుంది.
ఆట మొదలైన రెండో నిమిషంలో మణిందర్ రెండు గోల్స్ చేశాడు. ఆపై 28, 29 నిమిషాల్లోనూ గోల్స్ కొట్టాడు. మంజీత్, రహీల్, మణ్‌దీప్ మోర్ కూడా రెండేసి గోల్స్ సాధించారు.