ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయి

ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయి

భారత్ లో గత ఏడాది కంటే ఈ ఏడాది ఉగ్రదాడులు పెరిగాయని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ నివేదిక విడుదల చేసింది. 37 శాతం ఉగ్రదాడులు జమ్మూకాశ్మీర్ లోనే నమోదైనట్లు తెలిపింది. గత ఏడాది భారత్ లో 679 ఉగ్రదాడులు జరిగితే.. అందులో 567 మంది మరణించారు. ఉగ్రదాడుల్లో భారత్ టాప్-10లో ఉన్నట్లు చెప్పారు. ఆప్ఘాన్ లో 1,722 ఉగ్రదాడులు జరిగితే.. ఆ తర్వాత సిరియాలో 1322, కాంగోలో 999 దాడులు జరిగాయి. జమ్మూకాశ్మీర్ లో 257 ఘటనలుజరిగితే.. ఛత్తీస్ గఢ్ లో 145 ఘటనలు, జార్ఖండ్ లో 69 ఘటనలు జరిగినట్లు వెల్లడించింది. జమ్మూకాశ్మీర్ లో గతేడాది 244 ఉగ్రదాడులు మాత్రమే జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ డేటాను ఈ ఏడాది మార్చి 23న పార్లమెంట్ లో ప్రకటించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఉగ్రదాడులు తగ్గాయని కేంద్రం తెలిపింది.