బీహార్ దశ తిరిగిందా : దేశంలో అతి పెద్ద బంగారు గని.. ఎక్కడంటే..

బీహార్ దశ తిరిగిందా : దేశంలో అతి పెద్ద బంగారు గని.. ఎక్కడంటే..

దేశంలోనే అతిసంపన్న రాష్ట్రంగా బీహార్ అవతరించే అవకాశం ఉందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది.  ఇప్పటి వరకు అత్యంత పేద రాష్ట్రంగా పరిగణించబడుతున్న బీహార్ లోని రెండు జిల్లాల్లో భారీగా బంగారు నిల్వలున్నాయని  కేంద్ర  ఖనిజాల శాఖ మంత్రి  పార్లమెంట్‌లో సమాచారం అందించారు. దేశంలోని బంగారు నిల్వల్లో 44 శాతం బీహార్ లోని జాముయి జిల్లాలో , బంకాజిల్లాలోని కటారియా ప్రాంతంలో ఉన్నాయని గుర్తించారు.  వీటిని గుర్తించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సర్వ చేపట్టింది.  అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కరామతియాలో  బంగారాన్ని వెలికితీస్తారని, ఇది జాముయికే కాకుండా యావత్ దేశానికి, రాష్ట్రానికి మేలు చేస్తుందని సోనో బ్లాక్ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీహార్‌లో దేశంలోనే అతిపెద్ద బంగారం నిల్వ

బీహార్ లోని జాముయి జిల్లాలోని సోనో బ్లాక్ ప్రాంతంలో..కర్మతియా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  సర్వే చేసిన తర్వాత, దాని ప్రకారం.. దేశంలో అతిపెద్ద బంగారు నిల్వలు ఉన్నాయని నిర్దారించారు. జాముయి జిల్లాలో దాదాపు 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, అందులో 27.6 టన్నుల ఖనిజాలు అధికంగా ఉన్నాయని సర్వే తెలిపింది.   జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు, సర్వేలో నిమగ్నమైన ఏజెన్సీ రాష్ట్ర గనులు మరియు భూగర్భశాస్త్రశాఖ  బంగారు నిక్షేపాల శోధన కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. "భారతదేశంలో అతిపెద్ద బంగారు నిల్వ"ను అన్వేషించడానికి కొత్త బిడ్‌ను బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గత ఏడాది లోక్‌సభలో భారతదేశం యొక్క బంగారు నిల్వలో అత్యధిక వాటాను బీహార్ కలిగి ఉందని సూచించారు.

జాముయిలో బంగారు నిల్వలు

జాముయిలో బంగారు నిల్వల అన్వేషణ కోసం, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) మరియు GSI అలాగే అన్వేషణలో పాలుపంచుకున్న ఇతర ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. GSI ఫలితాల విశ్లేషణలో, జాముయి జిల్లాలోని కర్మతియా, ఝఝా మరియు సోనోలలో బంగారం ఉనికిని కనుగొనడం సంప్రదింపుల ప్రక్రియకు దారితీసింది. G3 (ప్రాధమిక) దశ అన్వేషణ కోసం బీహార్ ప్రభుత్వం రాబోయే కొద్ది వారాల్లో కేంద్ర ఏజెన్సీ లేదా ఏజెన్సీలతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందని, అయితే G2 (సాధారణ) అన్వేషణ కొన్ని ప్రదేశాలలో కూడా నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు.

బీహార్లో మిలియన్ టన్నుల ఖనిజం

నేషనల్ మినరల్ ఇన్వెంటరీ డేటా ప్రకారం  బీహార్‌లో 222.885 మిలియన్ టన్నుల బంగారు లోహం ఉందని కేంద్రమంత్రి  ప్రహ్లాద్ జోషి చెప్పారు. భారతదేశంలో 2015 ఏప్రిల్ 1  నాటికి దాదాపు 500.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం అందుబాటులో ఉందని అంచనా వేశారు, ఇందులో 654.74 టన్నుల బంగారు లోహం ఉంది. ఈ మొత్తంలో, 222.885 మిలియన్ టన్నులు (44 శాతం) బీహార్ లోనే ఉన్నాయని..  ఇందులో 37.6 టన్నుల బంగారు లోహం ఉంది.    జాముయి ,బంకాలో బంగారు ఖనిజం కోసం సర్వే ప్రారంభమైన తర్వాత, ఇక్కడ తవ్వకం పనులు ప్రారంభమవుతాయని, అప్పుడు బీహార్ సుభిక్షంగా మారుతుందని కరామటియా గ్రామ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త టెక్నాలజీతో తవ్వకాలు 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారంతో సహా ఇతర లోహాల తవ్వకానికి సంబంధించిన నిబంధనలను సవరించినప్పుడు, భూమిలోని  లోహాలను తవ్వేందుకు  G-4 స్థాయి లైసెన్స్ మంజూరు చేయడానికి వేలం నిర్వహిస్తామని తెలిపారు.    మైనింగ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతకు అదనంగా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం యొక్క అవకాశాలు ఉన్నాయి, ఇది బంగారం వెలికితీత వ్యయాన్ని తగ్గిస్తుంది.