ఆస్ట్రేలియా లెజెండ్స్ పై ఇండియా లెజెండ్స్‌ విజయం

ఆస్ట్రేలియా లెజెండ్స్ పై ఇండియా లెజెండ్స్‌ విజయం

రాయ్‌‌‌‌పూర్‌‌: సచిన్‌‌ టెండూల్కర్​ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్‌‌ టీమ్‌‌.. రోడ్‌‌ సేఫ్టీ వరల్డ్‌‌ సిరీస్‌‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో నమన్‌‌ ఓజా (62 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90) దంచికొట్టడంతో.. మంగళవారం జరిగిన సెమీస్‌‌లో ఇండియా లెజెండ్స్‌‌ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌‌పై గెలిచింది. తొలుత ఆసీస్‌‌ 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. బెన్‌‌ డంక్‌‌ (46) టాప్​స్కోరర్​. ఇండియా బౌలర్లలో అభిమన్యు మిథున్‌‌, యూసుఫ్‌‌ పఠాన్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 19.2 ఓవర్లలో 175/5 స్కోరు చేసింది. ఓజాకు తోడుగా ఇర్ఫాన్‌‌ పఠాన్‌‌ (37 నాటౌట్‌‌) రాణించాడు. నమన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.