మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్కు వరుసగా నాలుగో సారి నిరాశ ఎదురైంది. మిస్ యూనివర్స్ పోటీల్లో చివరిగా.. భారత్ 2021లో విజేతగా నిలిచింది. భారత్ నుంచి ఈ పోటీల్లో నిలిచిన హర్నాజ్ సంధు 2021లో మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత గత నాలుగేళ్ల నుంచి భారత్కు ఈ పోటీల్లో నిరాశ తప్పడం లేదు. గతేడాది.. 2024లో విజేతగా డెన్మార్క్ యువతి విక్టోరియా కేయిర్ థెల్వింగ్ నిలిచింది. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో కూడా భారత్కు నిరాశ తప్పలేదు.
మిస్ వరల్డ్-2025 విజేతగా థాయిలాండ్ సుందరి ‘ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ’ టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా.. 2025లో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్.. ఈ రెండు ప్రతిష్టాత్మక కాంపిటీషన్స్ లో భారత్కు నిరాశనే మిగిలింది.
టాప్ 8లో చోటు దక్కకపోవడంతో మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. మిస్ యూనివర్స్ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ టాప్ 12లో నిలవలేకపోవడంతో ఈ ఏడాది కూడా భారత్‌కు అందాల కిరీటం చేజారింది. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో 120కి పైగా దేశాల అందగత్తెలు టైటిల్ కోసం పోటీపడ్డారు.
