- 2–3 నెలల్లో అందుబాటులోకి
న్యూఢిల్లీ: లోకల్‌గా చిప్‌ల తయారీని పెంచేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో (సుమారు 10.8 బిలియన్ డాలర్లతో) ఒక కొత్త ఫండ్‌ను తీసుకురానుంది. ఈ ఫండ్ ద్వారా చిప్ డిజైన్ ప్రాజెక్టులకు, డివైజ్‌ల తయారీకి, సప్లయ్ చెయిన్ అభివృద్ధికి సబ్సిడీలు ఇస్తుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. రెండు నుంచి మూడు నెలల్లో ఈ ఫండ్ ప్రారంభం కావొచ్చని తెలిపారు. ఇప్పటికే కొన్ని సెమికండక్టర్ కంపెనీలను ఆకర్షించిన ఇండియా, కొత్త ఫండ్‌తో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది.
దీంతో పాటు గ్లోబల్ డిమాండ్ పెరుగుతుండడంతో అమెరికా, చైనా తరహాలో సబ్సిడీలతో పెట్టుబడులను పొందాలని ప్లాన్ చేస్తోంది. 2021లో ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం ద్వారా మైక్రాన్ టెక్నాలజీ, టాటా గ్రూప్, ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు గుజరాత్‌లో అసెంబ్లీ, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ యూనిట్లను ప్రారంభించాయి. ప్రస్తుతం భారత్ తక్కువ టెక్నాలజీ అవసరముండే చిప్‌లపై దృష్టి పెట్టింది.
