
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,357 కేసులు నమోదు అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరుకుంది. వైరస్ కు మరో 11 మంది బలయ్యారు.
గుజరాత్‌లో ముగ్గురు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం డేలీ పాజిటివిటీ రేటు 3.39% గా, కవరీ రేటు 98.74 శాతంగా ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్నీ రాష్ట్రాలకు సూచించింది.