ఫైనల్స్‌లో శ్రీలంక చెత్త రికార్డ్.. 23 ఏళ్ళ తర్వాత టీమిండియా ప్రతీకార విజయం

ఫైనల్స్‌లో శ్రీలంక చెత్త రికార్డ్.. 23 ఏళ్ళ తర్వాత టీమిండియా ప్రతీకార విజయం

ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. సొంతగడ్డపై టీమిండియాకు షాక్ ఇద్దామని భావించిన లంక జట్టుకు టీమిండియా బౌలర్లు పీడకల మిగిల్చారు. కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసి ఊహించని పరాజయాన్ని అందించారు.ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలోనే లంక ఒక చెత్త రికార్డ్ కి బలైంది. వన్డే ఫైనల్స్ లో అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసి భారత్ పేరున ఉన్న ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.
 
ప్రతీకారం తీర్చుకున్న భారత్
 
2000 సంవత్సరం కోకో కోలా కప్ ఫైనల్లో శ్రీలంక భారత్ జట్టుని కేవలం 54 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 299 పరుగులు చేసింది. దీంతో లంక జట్టుకు 245 పరుగుల భారీ విజయం దక్కింది. అయితే తాజాగా ఆసియా కప్ ఫైనల్లో భారత్ 50 పరుగులకే ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చున్నట్లయింది. 
 
ఇక మ్యాచ్ విషయానికి వస్తే  మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు  ఆలౌటైంది. కుశాల్ మెండిస్(17) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా.. హార్ధికి కి 3 బూమ్రాకి ఒక వికెట్ దక్కింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేజ్ చేసి 10 వికెట్ల విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు గిల్(27), కిషాన్(23) లాంఛనాన్ని పూర్తి చేశారు.