చెంగ్డౌ (చైనా) : ఇండియా షట్లర్ మాళవిక బన్సొద్.. చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మాళవిక 21–17, 19–21, 21–16తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలిచింది. దీంతో పీవీ సింధు తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గంటా ఐదు నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ షట్లర్‌కు గట్టి పోటీ ఎదురైంది.
తొలి గేమ్ ఆరంభంలో ఆధిక్యంలో నిలిచినా తర్వాత షాట్స్‌పై పట్టు కోల్పోయింది. దీంతో వరుసగా పాయింట్లు సాధించిన గిల్మోర్ 1–0 లీడ్‌లో నిలిచింది. రెండో గేమ్‌లో ఇద్దరు షట్లర్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. దీంతో 19–19 వరకు స్కోర్లు సమమయ్యాయి. ఈ దశలో మాళవిక రెండు స్మాష్‌లతో గేమ్ గెలిచింది. డిసైడర్‌లో భిన్నత్వం చూపెట్టిన మాళవిక స్టార్టింగ్ నుంచే స్పష్టమైన ఆధిపత్యం చూపెట్టింది.
ఎక్కడా స్కోరును సమం చేసే అవకాశం ఇవ్వకుండా ఈజీగా గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో మాళవిక.. అకానె యమగుచి (జపాన్)తో తలపడుతుంది.