ఈనెల 26న ఇండియా, సౌతాఫ్రికా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌

ఈనెల 26న ఇండియా, సౌతాఫ్రికా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌

మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల టెస్ట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం సౌతాఫ్రికా చేరుకున్న  టీమిండియా అప్పుడే ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది.  తేలికపాటి ఎక్స్‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌సైజుల అనంతరం ప్లేయర్లంతా నెట్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేశారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ సహా ప్లేయర్లంతా పాల్గొన్న  ఈ సెషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో పెట్టింది. కోహ్లీ,  అజింక్యా  రహానె, చతేశ్వర్‌‌‌‌‌‌‌‌ పుజారా , హనుమ విహారి, మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ చేయగా అశ్విన్‌‌‌‌‌‌‌‌, బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌, ఉమేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు వాళ్లకి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌ మొత్తాన్ని పర్యవేక్షించాడు. అంతకుముందు టీమిండియా మొత్తం ఓ తేలికపాటి వామప్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో పార్టిసిపేట్‌‌‌‌‌‌‌‌ చేసింది.  ముంబైలో మూడు రోజుల హార్డ్‌‌‌‌‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ తర్వాత చార్టెడ్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో జోహనెస్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ వెళ్లిన కోహ్లీసేన అక్కడ ఒక రోజు మొత్తం ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉంది. శనివారం ఉదయం ఇక్కడి ఓ రిసార్ట్‌‌‌‌‌‌‌‌లో ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. వామప్‌‌‌‌‌‌‌‌, తేలికపాటి ఎక్స్‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ల అనంతరం అందరు కలిసి ఫుట్‌‌‌‌‌‌‌‌వాలీ గేమ్‌‌‌‌‌‌‌‌ ఆడి బాడీని యాక్షన్‌‌‌‌‌‌‌‌కు రెడీ చేశారు. కోచ్‌‌‌‌‌‌‌‌  ద్రవిడ్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌  కోహ్లీ సహా టీమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఫుట్‌‌‌‌‌‌‌‌వాలీ ఆడారు.  ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ  ట్వీట్‌‌‌‌‌‌‌‌ చేసింది. అయితే ఫుట్‌‌‌‌‌‌‌‌వాలీ గేమ్‌‌‌‌‌‌‌‌ను జట్టు మొత్తం ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేసిందని స్ట్రెంథ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కండీషనింగ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ సోహమ్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.  ‘మేమంతా ముంబైలో మూడు రోజులు క్వారంటైన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాం. ఆ తర్వాత పది  గంటల పాటు ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ జర్నీ చేశాం. ఇక్కడికి చేరిన తర్వాత మరో రోజు హార్డ్‌‌‌‌‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాం. అందువల్ల పూర్తి స్థాయి ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌ అప్పుడే మొదలుపెట్టడం ప్లేయర్లకు రిస్క్‌‌‌‌‌‌‌‌. మేము సముద్ర మట్టానికి 1400 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు రెండు లేదా మూడు రోజులు పడుతుంది. ఫుట్‌‌‌‌‌‌‌‌వాలీని అందరు ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఏం ఆడాలనే దానిపై మేము చాలా సేపు చర్చించి ఈ గేమ్​ ఆడాం. ఫుట్‌‌‌‌‌‌‌‌వాలీ ఇకపై టీమిండియా గేమ్‌‌‌‌‌‌‌‌గా మారుతుంది. ప్లేయర్లు సంతోషంగా ఉండటానికి,  వాళ్ల ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెంచడానికి ఈ గేమ్‌‌‌‌‌‌‌‌ బాగా హెల్ప్‌‌‌‌‌‌‌‌ అవుతోంది’ అని  సోహమ్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ఒమిక్రాన్‌‌‌‌‌‌‌‌ ముప్పు నేపథ్యంలో కోహ్లీ సేన కోసం సౌతాఫ్రికా బోర్డు ఓ రిసార్ట్‌‌‌‌‌‌‌‌ను బుక్‌‌‌‌‌‌‌‌ చేసింది. టీమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అంతా అక్కడే ఉంటున్నారు.  26న ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభమవుతుంది.