బుమ్రా ఇంటికి బుడ్డోడు

బుమ్రా ఇంటికి బుడ్డోడు

ముంబై: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా భార్య సంజన సోమవారం ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ద్వారా వెల్లడించారు. బుడ్డోడికి అంగద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా అని పేరు పెట్టినట్టు తెలిపాడు.  

కాగా,  ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం శ్రీలంక వెళ్లిన బుమ్రా భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండేందుకు  ముంబై వచ్చేశాడు. సూపర్4 రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తను తిరిగి జట్టులో చేరనున్నాడు.