న్యూఢిల్లీ: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ సీజన్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా 14 సిరీస్‌లు ముగిసిన తర్వాత ఓవరాల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన నీరజ్ ఫైనల్ బెర్తు దక్కించుకున్నాడు. ఈ సీజన్ ఫైనల్ ఈ నెల 13, 14వ తేదీల్లో బ్రసెల్స్‌లో జరగనుంది.
దోహా, లాసానె డైమండ్ లీగ్ మీట్స్ రెండింటిలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. జూరిచ్‌లో గురువారం జరిగిన మీట్‌కు దూరంగా ఉన్నాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్, జర్మనీ స్టార్ జులియన్ వెబర్ 29, 21 పాయింట్లతో టాప్2 ప్లేస్‌ల్లో నిలిచారు. నీరజ్ 2022 డైమండ్ లీగ్ ఫైనల్లో గెలిచి గతేడాది రన్నరప్‌గా నిలిచాడు.