బంగ్లాకు అండగా భారత్.. ఇంధన సంక్షోభంలోనూ 5 వేల టన్నుల డీజిల్ సరఫరా

బంగ్లాకు అండగా భారత్.. ఇంధన సంక్షోభంలోనూ 5 వేల టన్నుల డీజిల్ సరఫరా

న్యూఢిల్లీ: ఇరాన్‏తో అమెరికా, ఇజ్రాయెల్- చేస్తున్న యుద్ధంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు భారత్ అండగా నిలిచింది. మంగళవారం దాదాపు 5 వేల టన్నుల డీజిల్‌‌‌‌‌‌‌‌ను బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర సర్కార్ పంపించింది. అస్సాంలోని నుమలీగఢ్ రిఫైనరీలో తయారైన డీజిల్‌‌‌‌‌‌‌‌ను పైప్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా మొదట పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని సిలిగురిలో ఉన్న మార్కెటింగ్ టెర్మినల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

అక్కడ ఉన్న'భారత్ బంగ్లాదేశ్ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌షిప్ పైప్‌‌‌‌‌‌‌‌లైన్(131 కిలోమీటర్లు)' ద్వారా బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌లోని దినాజ్‌‌‌‌‌‌‌‌పూర్ జిల్లాలో ఉన్న పర్బతీపూర్ డిపోకు డీజిల్‌‌‌‌‌‌‌‌ను పంపింగ్ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) చైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. భారత్ ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్‌‌‌‌‌‌‌‌ను బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌కు సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు.