స్వీప్ చేయాలె.. నేడు అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా మూడో టీ20

స్వీప్ చేయాలె.. నేడు అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా మూడో టీ20

బెంగళూరు :  టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన టీమిండియా ఆఖరాటలోనూ అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచి  సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగే చివరి, మూడో టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  ఇండియా అన్ని విభాగాల్లోనూ సత్తా చాటింది. కానీ, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్ శర్మ రెండు సార్లు డకౌట్ అవ్వడమే నిరాశ కలిగించింది. 

దాంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలని టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరుకుంటున్నారు. ఇక, గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఇండియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. పలువురు సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శివం దూబే సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో మెరుపు ఫిఫ్టీలతో ఆకట్టుకున్నాడు. ఇక 14 నెలల తర్వాత ఆడిన తొలి ఇంటర్నేషనల్ టీ20లో కోహ్లీ 16 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 29 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీఎంట్రీ ఇచ్చాడు. 

చిన్న గాయంతో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరమైన ఓపెనర్ యశస్వి గత పోరులో ఫిఫ్టీతో సత్తా చాటాడు. దాంతో ఇప్పుడు  మరో ఓపెనర్  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే అందరి దృష్టి ఉంది.  బెంగళూరులో అయినా తను బ్యాట్ ఝుళిపిస్తాడేమో చూడాలి. ఇక, తుది జట్టులో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్, పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్ రావొచ్చు. కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జితేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బరిలోకి దిగుతాడు. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచి ఊరట దక్కించుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే ఆ జట్టు సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది.

రీఎంట్రీకి రెడీ అవుతున్న పంత్

కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో ఇండియా ప్రాక్టీస్‌‌కు ముందు తను నెట్స్‌‌లో బ్యాటింగ్ చేశాడు. మెరుగైన ఫిట్‌‌నెస్‌‌, మ్యాచ్‌‌ రెడీనెస్ చూపెట్టాడు. అనంతరం తోటి ప్లేయర్లతో కలిసి ముచ్చటించాడు.