కరోనా ట్రీట్ మెంట్ కు 4 ఆయుర్వేద మందులు

కరోనా  ట్రీట్ మెంట్ కు 4  ఆయుర్వేద మందులు

వారం రోజుల్లో ట్రయల్స్ చేస్తామంటూ ఆయుష్ మినిస్టర్ ట్వీట్

న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు ట్రీట్ మెంట్ కోసం ఆయుష్ డిపార్ట్ మెంట్ కూడా తమ వంతు ప్రయత్నం చేస్తోంది. సంప్రదాయ ఆయుర్వేద మందులతో కరోనాకు చికిత్స కోసం నాలుగు రకాల మందులను సిద్ధం చేశామని ఆయుష్ మినిస్టర్ శ్రీపద్ నాయక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ మందులతో ట్రయల్స్ నిర్వహిస్తామన్నారు. రోగ నిరోధక శక్తి ని పెంచే పలు మందులను పరీక్షించి చివరగా నాలుగు ఆయుర్వేద మందులను కరోనా చికిత్స ను ఉపయోగపడతాయని గుర్తించినట్లు చెప్పారు. ట్రయల్స్ లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ కోసం అటు అల్లోపతి మెడిసిన్ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా అయుష్ విభాగం సైతం సంప్రదాయక విధానంలోనూ కరోనా కు మందు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆయుష్ లో ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి విభాగాలు ఉన్నాయి. దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద మందులతో మంచి ఫలితాలుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అనుమతితో కరోనా కు కూడా ఆయుర్వేదం మందులను ప్రయోగిస్తున్నారు. కరోనా ” మా సాంప్రదాయ ఆయుర్వేద మెడిసిన్ ఈ మహమ్మారిని అధిగమించడానికి కచ్చితంగా మార్గం చూపుతుందని ఆశాజనకంగా ఉన్నాను ” అంటూ మిస్టర్ నాయక్ ట్వీట్ చేశారు.