ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: పంజాబ్ కింగ్స్ డైరెక్ట్గా బహిష్కరణకు దిగిందా? సంచలనంగా మారిన పోస్ట్..

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: పంజాబ్ కింగ్స్ డైరెక్ట్గా బహిష్కరణకు దిగిందా? సంచలనంగా మారిన పోస్ట్..

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎక్కడ లేనంత క్రేజీ.. హై ఓల్టేజ్ నెలకొంటుంది. దాయాది దేశాలు తలపడిన ప్రతీసారి ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లు ఉంటుంది సీన్. రెండు దేశాల ఫ్యాన్స్ వీరావేశంతో రగిలి పోతూ.. తమ టీమ్స్ గెలిస్తే.. ఆ దేశాన్ని యుద్ధంలో ఓడించాం అన్నంత ఈగో సాటిస్ఫాక్షన్ పొందుతుంటారు. అయితే పహల్గాం దాడి.. ఆపరేషన్ సిందూర్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో మరింత హై ఓల్టేజ్ వెదర్ ఈ మ్యాచ్ కు ముందే కనిపిస్తోంది.

పాకిస్తాన్ ఉగ్ర మూకలు జరిపిన పహల్గాం దాడిలో 26 మంది భారత టూరిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఆపరేషన్ సిందూర్ తో పాక్ ఉగ్ర స్థావరాలు, ఆర్మీ బేస్ క్యాంపులను ధ్వంసం చేసి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది  ఇండియా. దీంతో ఇరు దేశాల మధ్య కొన్నాళ్లపాటు యుద్ధం నడిచింది. 

ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్ లో ఇండియా.. పాకిస్తాన్ తో ఆడకపోవడమే బెటర్ అని సీనియర్ క్రికెటర్లతో పాటు కామన్ ఆడియన్స్ వరకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా -పాక్ మ్యాచ్ కన్ఫామ్ అయ్యాక.. బీసీసీఐ తీరును చాలా మంది తప్పు బట్టారు. 26 ప్రాణాల కంటే డబ్బే ఎక్కువయ్యిందా.. మ్యాచ్ ఆడకపోతే వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో బాయ్ కాట్ ఇండియా-పాక్ మ్యాచ్.. అనే ట్రెండ్ కూడా నడుస్తోంది. 

రెండు దాయాది జట్ల మధ్య పోరుకు సిద్ధమైన వేళ.. మ్యాచ్ కు ముందు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలనే క్యాంపెయిన్ లో చేరినట్లు ఆ పోస్ట్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. మ్యాచ్ కు వ్యతిరేకంగా.. బాయ్ కాట్ చేయాలని తన అభిప్రాయాన్ని టీమ్ మేనేజ్ మెంట్ పోస్ట్ రూపంలో చెప్పారు. 

ఇప్పుడు ఆ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. బాయ్ కాట్ క్యాంపెయిన్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో పాకిస్తాన్ పేరు వాడకుండా.. పాక్ లోగో లేకుండా.. ఓన్లీ ఇండియా లోగోతో.. మ్యాచ్ 2025, సెప్టెంబర్ 14.. రాత్రి 8 గంటలకు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఉన్నట్లు.. పోస్ట్ చేసింది. సూర్య కుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్ ఫోటోలతో చేసిన తంబ్.. ఇంప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ ఆ పోస్ట్ ను వైరల్ చేయడమే కాకుండా.. సప్పోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. అమాయకులను చంపుతున్న ఉగ్రవాద దేశంతో ఇండియా ఆడకపోవడమే మంచిదని కామెంట్స్ పెడుతున్నారు. సూటిగా.. ఎవరికీ భయపడకుండా.. బాయ్ కాట్ క్యాంపెయిన్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ కు సెల్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.