
తెలంగాణ స్టార్ ప్లేయర్ ఆకుల శ్రీజతో కూడిన ఇండియా టేబుల్ టెన్నిస్ బృందం.. మెగా గేమ్స్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన విమెన్స్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా 3–2తో రొమేనియాపై నెగ్గింది. తొలి మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో శ్రీజ–అర్చన కామత్ 11–9, 12–10, 11–7తో ఆదినా డీకన్–ఎలిజబెటా సమరాపై నెగ్గి బోణీ చేశారు.
సింగిల్స్‌లో మనిక బత్రా 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్ సాక్స్‌ను ఓడించి ఇండియాను 2–0 ఆధిక్యంలో నిలిపింది. రెండో సింగిల్స్‌లో శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమరా చేతిలో ఓడటంతో ఆధిక్యం 2–1కి తగ్గింది. మూడో సింగిల్స్‌లో బెర్నాడెట్ సాక్స్ 11–5, 8–11, 11–7, 11–9తో అర్చన కామత్‌పై నెగ్గడంతో స్కోరు 2–2తో సమమైంది. ఈ దశలో ఆఖరి మ్యాచ్ ఆడిన మనిక బాత్రా 11–5, 11–9, 11–9తో ఆదినా డీకన్‌పై నెగ్గి ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.