
ముల్లన్‌పూర్: బ్యాటింగ్‌లో ప్రతీకా రావల్ (64), స్మృతి మంధాన (58), హర్లీన్ డియోల్ (54) హాఫ్ సెంచరీలతో చెలరేగినా.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇండియా విమెన్స్ జట్టుకు ఓటమి తప్పలేదు. టార్గెట్ ఛేజింగ్‌లో ఫోబి లిచ్‌ఫీల్డ్ (88), బెత్ మూనీ (77 నాటౌట్), అనాబెల్ సదర్లాండ్ (54 నాటౌట్) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1–0 లీడ్‌లో నిలిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్లలో 281/7 స్కోరు చేసింది. రావత్, మంధాన, డియోల్ కలిసి 161 రన్స్ జోడించి వెనుదిరిగారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11), జెమీమా రోడ్రిగ్స్ (18), రాధా యాదవ్ (19) విఫలమైనా.. రిచా ఘోష్ (25), దీప్తి శర్మ (20 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. మేఘన్ షుట్ 2 వికెట్లు తీసింది. తర్వాత ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 282/2 స్కోరు చేసి గెలిచింది. అలీసా హీలీ (27) ఓ మాదిరిగా ఆడినా లిచ్ ఫీల్డ్, ఎలైస్ పెర్రీ (30)తో రెండో వికెట్‌కు 79, మూనీతో మూడో వికెట్‌కు 42 రన్స్ జోడించింది. చివర్లో మూనీ, సదర్లాండ్ నాలుగో వికెట్‌కు అజేయంగా116 రన్స్ జత చేసి 35 బాల్స్ మిగిలి ఉండగానే ఈజీగా గెలిపించారు. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ పడగొట్టారు. లిచ్ ఫోల్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది.