అఫ్గాన్​పై టీ20 సిరీస్​ కైవసం.. 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

అఫ్గాన్​పై టీ20 సిరీస్​ కైవసం.. 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
  •       ఇద్దరే దంచిన్రు
  •       హాఫ్‌‌‌‌ సెంచరీలతో చెలరేగిన యశస్వి, దూబె
  •        రెండో టీ20లో ఇండియా గ్రాండ్‌‌‌‌ విక్టరీ
  •        2-0తో సిరీస్‌‌‌‌ సొంతం


అఫ్గానిస్తాన్​తో ఆదివారం ఇండోర్​లో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​ను కైవసం చేసుకుంది. అఫ్గాన్​ ఇచ్చిన 173 రన్స్​ టార్గెట్​ను జైస్వాల్​ (68), దుబే (63) దంచికొట్టడంతో 15.4 ఓవర్లలోనే చేజ్​ చేసింది.

ఇండోర్‌‌‌‌: టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌ (34 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 68), శివమ్‌‌‌‌ దూబె (32 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 63 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌‌‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.

టాస్‌‌‌‌ ఓడిన అఫ్గానిస్తాన్‌‌‌‌ 20 ఓవర్లలో 172 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. గుల్బాదిన్‌‌‌‌ నబీ (35 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 57) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత ఇండియా 15.4 ఓవర్లలో 173/4 స్కోరు చేసి నెగ్గింది. విరాట్‌‌‌‌ కోహ్లీ (16 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లతో 29) ఫర్వాలేదనిపించాడు. అక్షర్​ పటేల్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 బుధవారం బెంగళూరులో జరుగుతుంది. 

గుల్బాదిన్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీ..

ఆరంభంలో ఇండియా బౌలర్లు అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ (3/32), రవి (2/39), అక్షర్‌‌‌‌ (2/17) దెబ్బకు.. అఫ్గాన్‌‌‌‌ ఓపెనర్లు రహమానుల్లా (14), ఇబ్రహీం (8)తో పాటు అజ్మతుల్లా (2) ఫెయిలయ్యారు. దీంతో 60/3త కష్టాల్లో పడిన అఫ్గాన్‌‌‌‌ను గుల్బాదిన్‌‌‌‌ నబీ కీలక ఇన్నింగ్స్‌‌‌‌తో నిలబెట్టాడు. మహ్మద్‌‌‌‌ నబీ (14)తో మూడో వికెట్‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌ జోడించడంతో పవర్‌‌‌‌ప్లేలో 58/2 స్కోరుతో ఉన్న అఫ్గాన్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 81/3కి చేరింది. తర్వాత నజీబుల్లా (23), కరీమ్‌‌‌‌ జనత్‌‌‌‌ (20), ముజీబ్‌‌‌‌ (21) దీటుగా ఆడారు. ఈ ముగ్గురి మధ్య 73 రన్స్‌‌‌‌ జతకావడంతో అఫ్గాన్‌‌‌‌ కోలుకుంది. 

రోహిత్‌‌‌‌ డకౌట్‌‌‌‌..

ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌  (0) వరుసగా రెండో మ్యాచ్‌‌‌‌లోనూ డకౌటయ్యాడు. అయితే యశస్వి, విరాట్‌‌‌‌ అఫ్గాన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను చితక్కొట్టారు. ఈ ఇద్దరు పోటీపడి ఫోర్లు, సిక్స్‌‌‌‌లు బాదారు. రెండో వికెట్‌‌‌‌కు 28 బాల్స్‌‌‌‌లోనే 57 రన్స్‌‌‌‌ జోడించి కోహ్లీ ఔటైనా ఇండియా 69/2 స్కోరుతో పవర్‌‌‌‌ప్లేను ముగించింది. ఈ టైమ్‌‌‌‌లో వచ్చిన శివమ్‌‌‌‌ దూబె తొలి మ్యాచ్‌‌‌‌ ఫామ్‌‌‌‌ను కంటిన్యూ చేశాడు. ఈ క్రమంలో యశస్వి 27 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీని పూర్తి చేయగా 9.2 ఓవర్లలో ఇండియా స్కోరు 100 దాటింది. 13వ ఓవర్‌‌‌‌లో కరీమ్‌‌‌‌ జనత్‌‌‌‌ (2/13) డబుల్‌‌‌‌ ఝలక్‌‌‌‌ ఇచాడు.

6 బాల్స్‌‌‌‌ తేడాలో యశస్వి, జితేష్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. దీంతో యశస్వి, దూబె మధ్య మూడో వికెట్‌‌‌‌కు 42 బాల్స్‌‌‌‌లో 92 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇక్కడి నుంచి రింకూ సింగ్‌‌‌‌ (9 నాటౌట్‌‌‌‌) అండగా దూబె సూపర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. నాలుగు భారీ సిక్సర్లు కొట్టి 22 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ ఫినిష్‌‌‌‌ చేశాడు. రింకూతో ఐదో వికెట్‌‌‌‌కు 17 రన్స్‌‌‌‌ జోడించి మరో 26 బాల్స్‌‌‌‌ మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్‌‌‌‌: 20 ఓవర్లలో 172 ఆలౌట్‌‌‌‌ (గుల్బాదిన్‌‌‌‌ నబీ 57, నజీబుల్లా జద్రాన్‌‌‌‌ 23, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 3/32). ఇండియా: 15.4 ఓవర్లలో 173/4 (యశస్వి జైస్వాల్​68, శివమ్‌‌‌‌ దూబె 63*, కరీమ్‌‌‌‌ జనత్‌‌‌‌ 2/13).