సెకండ్ టెస్ట్: భారత్ బ్యాటింగ్

సెకండ్ టెస్ట్: భారత్ బ్యాటింగ్

చెన్నై: ఇంగ్లండ్‌ తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచింది టీమిండియా.చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ టెస్టులో ఘోర పరాజయం దృష్ట్యా ఈ టెస్టులో కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది టీమిండియా. మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. అతని స్థానంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ అవకాశం ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్‌ను పక్కన బెట్టి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన షాబాజ్ నదీం స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారా అక్షర్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తుండడం విశేషం.

ఇంగ్లండ్ కూడా నాలుగు మార్పులు చేసింది. రోటేషన్ పద్ధతిలో భాగంగా బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, ఒల్లీ స్టోన్ కొత్తగా ఇంగ్లండ్ జట్టులో చేరారు. ఇక తొలి టెస్టులో ఓటమితో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలనే కసితో భారత్ బరిలోకి దిగుతుంటే.. మొదటి మ్యాచ్ విజయంతో ఇంగ్లీష్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో రెడీ అయింది.

టీమ్స్: