V6 News

ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో రోహిత్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌

ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో రోహిత్‌‌‌‌కు సిల్వర్‌‌‌‌

కైరో: ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా షూటర్లు సత్తా చాటారు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌‌‌ ప్రోన్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ కన్యన్‌‌‌‌ 615.8 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచి సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. కజకిస్తాన్‌‌‌‌ షూటర్‌‌‌‌ ఒలేగ్ నోస్కోవ్‌‌‌‌ 0.5 తేడాతో స్వర్ణం నెగ్గాడు. జూనియర్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ 25 మీటర్ల పిస్టల్‌‌‌‌ విభాగంలో సెజల్‌‌‌‌ కాంబ్లే 27 హిట్స్‌‌‌‌తో రజతాన్ని గెలుచుకుంది. కాత్సరినా ఇవనోవాకు గోల్డ్ లభించింది. 25 మీటర్ల పిస్టల్‌‌‌‌ ఫైనల్లో రాజ్‌‌‌‌ చంద్ర, అభినవ్‌‌‌‌ దేశ్వాల్‌‌‌‌ వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను సాధించారు. స్కీట్‌‌‌‌ విభాగంలో రిషమ్‌‌‌‌ గురోన్‌‌‌‌, ఇషాన్‌‌‌‌ సింగ్‌‌‌‌ లిబ్రా ఫైనల్‌‌‌‌కు చేరినా పతకాలు నెగ్గడంలో విఫలమయ్యారు. ఓవరాల్‌‌‌‌గా మూడు రజతాలు, ఓ కాంస్యం నెగ్గిన ఇండియా పతకాల పట్టికలో రెండో ప్లేస్‌‌‌‌లో ఉంది.