
పెర్త్: ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ మరోసారి నిరాశపరిచింది. రెండు దేశాల సిరీస్‌లో భాగంగా పెర్త్ హాకీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 2–-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిపోయింది. ఇండియా తరఫున నవనీత్ కౌర్ (35వ నిమిషం), లాల్‌రెమ్ సియామి (59వ ని) చెరో గోల్ కొట్టారు. ఆస్ట్రేలియా జట్టులో గ్రేస్ స్టీవర్ట్ (2వ ని), జేడ్ స్మిత్ (36వ ని), గ్రెటా హేస్ (42వ ని) తలో గోల్ సాధించారు.