Indian 2: తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ 2 ఎన్ని ధియేటర్లలో రిలీజ్?..టికెట్ రేట్లు ఏంటీ..బ్రేక్ ఈవెన్ ఎంత?

Indian 2: తెలుగు రాష్ట్రాల్లో ఇండియన్ 2 ఎన్ని ధియేటర్లలో రిలీజ్?..టికెట్ రేట్లు ఏంటీ..బ్రేక్ ఈవెన్ ఎంత?

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 1996లో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా (జూలై 12న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎన్ని థియేటర్లలో రిలీజ్ కానుందో..టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

Indian 2 టికెట్ రేట్లు:

భారతీయుడు-2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ సినిమాకు వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో రూ.75, సింగిల్ స్క్రీన్స్ లో రూ.50 అనగా..వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లు రూ.225, మల్టీ ఫ్లెక్స్ లలో రూ.350 టికెట్ రేట్లు వసూలు చేయబోతున్నాయి. అయితే, ఇపుడు ఇదే హాట్ టాపిక్ గామారింది. ఎందుకంటే, ఇండియన్ 2 తెలుగు సినిమా కాదు. మరి ఇంత రేట్ పెట్టి సినిమా చూడటానికి ఎవరు ఇష్టపడతారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు చెన్నైలో మాత్రం ఇందుకు భిన్నంగా టికెట్ రేట్లు దర్శమిస్తున్నాయి. చెన్నైలోని మల్టీప్లెక్స్‌ల్లో ఒక్కో టికెట్‌ ధర కేవలం రూ.190 రూపాయలుగా ఉంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

తెలుగులో కేవలం రూ.25 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. చూసుకుంటే ఇది బిజినెస్ పరంగా చాలా తక్కువనే చెప్పుకోవాలి.కమల్ హాసన్ ఇమేజ్, శంకర్ డైరెక్షన్ కు ఉన్న స్థాయికి తక్కువ బిజినెస్ ఇది. ఇపుడు పెంచిన టికెట్ ధరల పెంపు కేవలం వారం రోజులు మాత్రమే అమల్లో ఉండనున్నాయి.అది కూడా అన్ని తరగతులకు కాదు. కేవలం హయ్యర్ క్లాస్ సీట్లకు మాత్రమే టికెట్ రేట్లు పెంపు వర్తిస్తుంది. బి-క్లాస్,సి-క్లాస్ టికెట్ రేట్లు యథాతథంగా ఉంటాయి.

Indian 2 ప్రీ రిలీజ్ బిజినెస్:

ఇండియన్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్  తెలుగు రాష్ట్రాలలో రూ.25 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. ఎందుకంటే గతంలో శంకర్ మూవీ 2.ఓ, ఐ సినిమాలకి తెలుగు రాష్ట్రాల డిస్టిబ్యూటర్స్ చాలా చోట్ల భారీ నష్టాలు ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భారతీయుడు 2 మూవీని తక్కువ ధరలకి తెలుగు రాష్ట్రాల రైట్స్ ని డిస్టిబ్యూటర్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇటీవల ఇండియన్ 2 ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ కూడా తెలుగు డిస్టిబ్యూటర్స్ ని చాలా వరకు ముంచింది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారతీయుడు 2పై పెద్దగా రిస్క్ చేయలేదు. దీంతో భారతీయుడు2 మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని సాధించడం సులభం. 

Indian 2 థియేటర్స్:

ఇండియన్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7800కి పైగా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.తెలుగు రాష్ట్రాలలో దాదాపు 600కి పైగా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా రిలీజయ్యాక ఫస్ట్ టాక్ ను బట్టి..తెలుగు స్టేట్స్ లో మరిన్ని థియేటర్స్ పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం కల్కి హవా రోజురోజుకు తగ్గుతుండటంతో..ఇండియన్ 2 మరిన్ని థియేటర్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ మూవీ 1150 థియేటర్స్ లో తమిళనాట రిలీజ్ అవుతోంది.

పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మించారు.