గడిచిన మూడు నెలల్లో దేశ ఆర్థిక వృద్ధి అనూహ్యంగా మూడు త్రైమాసిక కనిష్ట స్థాయి 4.4 శాతానికి పడిపోయింది. దీనికి తోడు సిజ్లింగ్ హీట్ వేవ్ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ ముందే ప్రకటించింది. ఈ ఎండలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. భూగర్భ జలాలు తగ్గిపోతాయి. పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో వ్యవసాయ రంగ ఉత్పత్తి తగ్గటంతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భారత్ లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేడి గాలులు పంట ఉత్పత్తిని తగ్గిస్తాయి. డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో ఏప్రిల్ నెలలో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది.
