ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశవ్యాప్తంగా గ్రూప్– సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 2న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది.
పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)/ హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్.
మొత్తం ఖాళీలు: 40.
విభాగాల వారీగా ఖాళీలు:
- హెచ్‌క్యూ మెయింటెనెన్స్ కమాండ్, ఐఏఎఫ్ 14,
- హెచ్‌క్యూ ట్రైనింగ్ కమాండ్, ఐఏఎఫ్ 05,
- హెచ్‌క్యూ సెంట్రల్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ 03,
- హెచ్‌క్యూ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ 06,
- హెచ్‌క్యూ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ 06,
- హెచ్‌క్యూ సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ 05,
- హెచ్‌క్యూ సదరన్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ 01,
- ఇండిపెండెంట్ యూనిట్స్, ఐఏఎఫ్ 07.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్లో ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ 35 డబ్ల్యూపీఎం లేదా హిందీ టైపింగ్ స్పీడ్ 35 డబ్ల్యూపీఎం ఉండాలి.
మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. లైట్, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో వృత్తిపరమైన నైపుణ్యం, మోటారు యంత్రాంగంపై పరిజ్ఞానం తప్పనిసరి. మోటారు వాహనాలను నడపడంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 02.
లాస్ట్ డేట్: జూన్ 1.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ల పరిశీలన, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రాక్టికల్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ indianairforce.nic.inను సందర్శించండి.

