Virat Kohli: మైదానంలో ఎంతో అగ్రెసివ్‌గా ఉండే కోహ్లీ, బయట ఎంత సరదాగా, హుందాగా ఉంటారో అందరికి తెలిసిందే. అయితే, ఈరోజు (2026, ఏప్రిల్ 28న) ఢిల్లీలోని ఆర్కెపురం (RK Puram)లో గత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) సందర్శనలో ఈ రన్ మెషిన్ ఒక సాఫ్ట్ సైడ్‌ను చూపించారు. వెస్ట్ ఢిల్లీ పబ్లిక్ అకాడమీ ప్రారంభోత్సవంలో కోహ్లీ చేసిన సందేశం, విద్యార్థులతో ఆయన ప్రవర్తించిన తీరుకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది.
కొంచెం మాట్లాడనివ్వండి భయ్యా!:
కోహ్లీ వేదికపైకి రాగానే విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. ముఖ్యంగా ‘RCB, RCB’ అంటూ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ గోల ఎంతకీ తగ్గకపోవడంతో, కోహ్లీ తనదైన స్టైల్‌లో నవ్వుతూ.. "Bolne do yaar please" (దయచేసి నన్ను మాట్లాడనివ్వండి భయ్యా) అంటూ వేడుకోవడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
మీ కలల పట్ల నిజాయితీగా ఉండండి:
ఈ కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చే సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా "మీ కలల పట్ల మీరు నిజాయితీగా ఉండండి.. మీరు చేసే పనిలో 100 శాతం చిత్తశుద్ధి ఉందో లేదో మీకు మాత్రమే తెలుస్తుంది.. నేను చాలా చిన్న వయసులోనే క్రికెట్‌ను ఎంచుకున్నాను.. నా నిర్ణయం పట్ల నాకు క్లారిటీ ఉంది.. అందుకే నా కుటుంబంతో, ఉపాధ్యాయులతో ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పగలిగాను.. మీరు కూడా ఎంచుకున్న మార్గంలో వెనుకాడకుండా కష్టపడాలని విరాట్ కోహ్లీ హితబోధ చేశారు.
పాదాభివందనం చేయబోయిన స్టూడెంట్:
ఈ ఈవెంట్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంటున్న సమయంలో, ఒక విద్యార్థి గౌరవంతో కింగ్ కోహ్లీ కాళ్ళకు నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది చూసిన విరాట్ వెంటనే షాక్ అయి.. అతడిని ఆపి.. తన రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ పిల్లాడిని వారించారు.
KOHLI😭😭😭😭😭 pic.twitter.com/HpRCb7lDLn
— h (@kohlimax1833) April 28, 2026

