గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డును తీసుకెళ్తున్నారా.. ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, బర్త్ డేట్ సహా వ్యక్తిగత వివరాలన్నీ ఉన్నాయి కదా.. ఐడెంటిటీకోసం ఒక్క ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు అనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే.. ఎందుకంటే ఇక మీదట ఆధార్ కార్డు ను కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణించాలని ఈ కేవైసీ కేంద్రాలకు ఉడాయ్ ఆదేశాలు జారీ చేసింది..వివరాల్లోకి వెళితే..
ఆధార్ అనేది కేవలం గుర్తింపు ,చిరునామాకు మాత్రమే రుజువు అని, పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టం చేసింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ సమాచారం ఉన్నప్పటికీ దానిని పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించరాదని ఉడాయ్ తెలిపింది. ఆధార్ నమోదు సమయంలో అందించే సమాచారం సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ఇకనుంచి వయసు ధ్రువీకరణకు బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్కుల లిస్ట్ చూపించాలని కోరింది. AUA ,KUA ఏజెన్సీలకు రాసిన లేఖలో క్లియర్ గా చెప్పింది ఉడాయ్.
ALSO READ : మీకు తెలుసా ఇది పచ్చి నిజం
ఆధార్ కార్డుపై ఫోటో, అడ్రస్ సహా డేట్ ఆఫ్ బర్త్ సైతం ఉంటుంది.. అది ప్రూఫ్ ఎలా కాకుండా పోతుందని చాలా మందికి డౌట్ రావొచ్చు. అయితే ఇక్కడే అసలు మెలిక ఉంది. ఆధార్ చట్టం-2016 ప్రకారం ఆధార్ ఒక వ్యక్తి బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా అందించే ఐడెంటిటీ డాక్యుమెంట్ మాత్రమే.ఆధార్ కార్డులో ఉన్న బర్త్ డేట్ విషయంలో ఎప్పుడైనా వివాదం తలెత్తినప్పుడు, ఆ తేదీ సరైన పుట్టిన తేదీ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కార్డుదారుదే' అని UIDAI అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.
ఉడాయ్ రాసిన లేఖ ప్రకారం..బర్త్ డేట్ ప్రూఫ్ కు సంబంధించిన ప్రయోజనాల కోసం ఆధార్‌ను ఉపయోగించవచ్చో లేదో AUA ,KUA ఏజెన్సీలు అనగా సహకార బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టెలికం, ఈ గవర్నెన్స్, సబ్సిడీలు అందించే వివిధ రాష్ట్రప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ విభాగాలు నిర్ణయించవచ్చని పేర్కొంది. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ,ఇతర సేవల కోసం ఆధార్ వినియోగాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు ,ఇతర అధీకృత సంస్థలు నిర్ణయిస్తాయని తెలిపింది.

