ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్లు అదరగొడుతున్నారు. మొత్తంగా ఎనిమిది మంది బాక్సర్లు ఫైనల్‌కు దూసుకెళ్లి గోల్డ్ మెడల్స్ ముగింట నిలిచారు. ఇందులో వరల్డ్ చాంపియన్స్ మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సహా ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. మంగళవారం జరిగిన విమెన్స్ 48 కేజీ కేటగిరీ సెమీఫైనల్లో మీనాక్షి 4–-1తో థాయ్‌లాండ్‌కు చెందిన తిప్సచా యొద్వరీపై ఘనవిజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
57 కేజీ సెమీస్‌లో జైస్మిన్ 3–-2తో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ నిగినా ఉక్తామోవాపై పోరాడి గెలిచింది. ఇక, మెన్స్ సెమీఫైనల్స్‌లో విశ్వనాథ్ సురేష్ (50 కేజీ) 5–-0తో హుతైఫా ఈషిష్ (జోర్డాన్)ను చిత్తు చేయగా.. సచిన్ (60 కేజీ) 4–-1తో థాయ్‌లాండ్ బాక్సర్ సక్డా రువామ్తమ్‌ను ఓడించి ఫైనల్ చేరాడు. కాగా, ఆకాష్, లోకేష్, నరేందర్, హర్ష్ చౌదరి సెమీ ఫైనల్స్‌లో పరాజయం పాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
