ఇండియన్​ కోస్ట్​గార్డులో నావిక్ పోస్టులు

ఇండియన్​ కోస్ట్​గార్డులో నావిక్ పోస్టులు

 భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్‌‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)- 2024 బ్యాచ్ ద్వారా 260 నావిక్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్ అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: ఇంటర్​ (మ్యాథ్స్, ఫిజిక్స్‌‌) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 18 నుంచి 22 సంవత్సరాలు మధ్య ఉండాలి. నెలకు రూ.21700 వేతనం చెల్లిస్తారు.

సెలెక్షన్​: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, మెడికల్​ టెస్ట్​, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్​, మే, అక్టోబర్​లో వివిధ దశల పరీక్షలు నిర్వహిస్తారు. 

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది) అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.joinindiancoastguard.cdac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.