దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో భారతీయ కంపెనీలు

దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో భారతీయ కంపెనీలు

హైదరాబాద్​, వెలుగు: దుబాయ్, భారతదేశాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. 2026 మొదటి క్వార్టర్‌‌లో 3,995 కొత్త భారతీయ కంపెనీలు దుబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (డీసీసీ) లో చేరాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి నమోదైన మొత్తం క్రియాశీల భారతీయ కంపెనీల సంఖ్య 84,088 కి చేరింది. ఇక్కడ అత్యంత పెద్ద విదేశీ వ్యాపార సమాజంగా భారతదేశం తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. అంతర్జాతీయ విస్తరణకు, దీర్ఘకాలిక వృద్ధికి ఈ నగరం సురక్షితమని  భారతీయ వ్యాపారవేత్తలు భావిస్తున్నారని దుబాయ్ చాంబర్స్ ప్రెసిడెంట్, సీఈఓ మొహమ్మద్ అలీ రాషెద్ లూటా తెలిపారు. దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్ల ఆర్థిక ప్యాకేజీ కూడా వ్యాపార ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడిందని చెప్పారు.