జూన్ 17న ఉదయం మ్యాచ్.. మధ్యాహ్నం మ్యాచ్.. రాత్రికి మరో మ్యాచ్.. భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

జూన్ 17న ఉదయం మ్యాచ్.. మధ్యాహ్నం మ్యాచ్.. రాత్రికి మరో మ్యాచ్.. భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

Indian Cricket Team Busy Schedule on June 17: భారత క్రికెట్ అభిమానులకు ఎల్లుండి (జూన్ 17న) పండగలాంటి రోజు అని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఒక్క రోజే ఏకంగా మూడు క్రేజీ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా టీమిండియాకు సంబంధించిన వేర్వేరు జట్లు మైదానంలోకి దిగుతుండటంతో.. ఏకంగా 12 గంటల పాటు నాన్‌స్టాప్ క్రికెట్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

* ఇండియా 'A' vs ఆఫ్ఘనిస్తాన్ 'A': 
ట్రై సిరీస్‌లో భాగంగా ఎల్లుండి ఉదయం 10:00 గంటలకే మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇండియా ‘A’, ఆఫ్ఘనిస్తాన్ ‘A’ జట్ల మధ్య వన్డే (ODI) పోరు జరగబోతుంది. యంగ్ ప్లేయర్స్ తమ సత్తా చాటడానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది.

* టీమిండియా vs ఆఫ్ఘనిస్తాన్: 
ఇక మధ్యాహ్నం నుంచి అసలైన హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ జట్టుతో టీమిండియా తన రెండవ వన్డే (2nd ODI) మ్యాచ్‌లో తలపడనుంది. సీనియర్ల పోరు కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

*  భారత మహిళల జట్టు vs నెదర్లాండ్స్:
పగలు మెన్స్ క్రికెట్ ముగిశాక, రాత్రి సమయంలో ఉమెన్స్ క్రికెట్ ధమాకా షురూ కాబోతుంది. మహిళల టి20 వరల్డ్ కప్ (T20 WC) లో భాగంగా రాత్రి 7:00 గంటలకు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనుంది. వరల్డ్ కప్ పోరు కావడంతో మన అమ్మాయిల మ్యాచ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

* దీంతో బుధవారం నాడు పొద్దున్న 10 గంటల నుంచి రాత్రి దాకా టీవీలు, మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోయేలా మొత్తం 12 గంటల నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ రెడీ అయింది. దీంతో ఆ రోజు అన్ని మ్యాచులని చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. మరీ చూడాలి జూన్ 17న భారత్ జట్టు అన్ని విభాగాల్లో గెలుస్తుందో లేదో అనేది.