
పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రికార్డ్ స్థాయిలో తొమ్మిదో సారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కు కైవసం చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ లో చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ మెగా ఫైనల్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో చాలా హై డ్రామా నడిచింది. టీమిండియా టైటిల్ తీసుకోవడానికి నిరాకరించినా చాలా సంతోషంగా సెలెబ్రేషన్ జరుపుకుంది. గెలుపు సంగతి పక్కన పెడితే టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను చేసిన ర్యాగింగ్ వైరల్ అవుతోంది.
మ్యాచ్ తర్వాత సెలెబ్రేషన్ లో భాగంగా టీమిండియా యంగ్ క్రికెటర్లు జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ముగ్గురు కలిసి సంజు శాంసన్ ముందు అబ్రార్ అహ్మద్ సెలెబ్రేషన్ ను ఇమిటేట్ చేస్తూ కనిపించారు. అబ్రార్ ను ఎగతాళి చేస్తూ కనిపించడంతో.. వీరు చేసిన పనికి శాంసన్ నవ్వకుండా ఉండలేకపోయాడు. ఈ పాక్ స్పిన్నర్ ఎవరినైనా ఔట్ చేస్తే పెవిలియన్ వైపు వెళ్లు అన్నట్టు ముఖంతో సైగ చేస్తాడు. మ్యాచ్ తర్వాత అబ్రార్ ఇమిటేట్ చేస్తూ ఇండియా ప్లేయర్స్ కనిపించడం నవ్వు తెప్పిస్తుంది. ఇది చూసిన నెటిజన్స్ పాక్ బౌలర్ కు ర్యాగింగ్ అదిరింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ లో ఇండియా ఛేజింగ్ చేస్తున్నప్పుడు 20 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 13 ఓవర్ రెండో బంతికి శాంసన్ ను అబ్రార్ అహ్మద్ ఔట్ చేశాడు. గిల్ ఔటైన తర్వాత టీమిండియాను ఆదుకునే బాధ్యత తిలక్ వర్మ, సంజు శాంసన్ తీసుకున్నారు. జాగ్రత్తగా జట్టును ముందుకు తీసుకెళ్లారు. వికెట్ కాపాడుకుంటూనే మధ్యలో బౌండరీ కొడుతూ వచ్చారు. మూడో వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యం తర్వాత పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. మంచి టచ్ లో కనిపించిన శాంసన్ ను ఔట్ చేసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో అబ్రార్.. శాంసన్ ను పెవిలియన్ కు వెళ్ళమని తన ముఖంతో సైగ చేశాడు. దీనికి రివెంజ్ గా అదే స్టయిల్లో అబ్రార్ కు మన యంగ్ క్రికెటర్లు ఇచ్చి పడేశారు.
ALSO READ : ఇండియా గెలుపును ఆపరేషన్ సిందూర్‌తో పోల్చిన మోదీ..
ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ పాకిస్థాన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ అందించారు. 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో పర్వాలేదనిపించిన పాక్.. ఊహించని విధంగా వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోయి 146 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప టార్గెట్ లో 20 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయిన తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 69: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో ఇండియాను గెలిపించాడు. సంజు శాంసన్ (24), దూబే (33) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
— 💥 (@Johnsmaink) September 28, 2025