ఇండియా గెలుపును ఆపరేషన్ సిందూర్తో పోల్చిన మోదీ.. కనీస జ్ఞానం లేదంటూ కాంగ్రెస్ ఫైర్

ఇండియా గెలుపును ఆపరేషన్ సిందూర్తో పోల్చిన మోదీ.. కనీస జ్ఞానం లేదంటూ  కాంగ్రెస్ ఫైర్

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ ను మట్టి కరిపించి మరోసారి విజేతగా నిలిచింది టీమిండియా. ఈ స్టన్నింగ్ విక్టరీని ఆపరేషన్ సిందూర్ కు లింక్ చేస్తూ ప్రధాని మోదీ చేసిన పోస్ట్ విమర్శల పాలవుతోంది. పీఎం మోదీకి కనీస అవగాహన లేదని మోదీ ట్వీట్ పై కాంగ్రెస్ మండిపడింది. 

టీమిండియా ఆసియా కప్ గెలిచిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు. ఇది క్రీడల్లో ఆపరేషన్ సిందూర్. ఔట్ కమ్ సేమ్. ఇండియా గెలవడం.. మన క్రికెటర్లకు కంగ్రాట్స్.. అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

మోదీ ట్వీట్ పై కాంగ్రెస్ నేత అతుల్ లోంధే పాటిల్ మాట్లాడుతూ.. ఫారెన్ పాలిసీపై ప్రధాని మోదీకి కనీస అవగాహన ఉందా..? అనే డౌట్ వస్తుంది. ఒక వేళ ఆడితే క్రీడా స్ఫూర్తితో ఆడాలి.. ఒకవేళ ఆపరేషన్ సిందూర్ నడుస్తుంటే.. మనం ఆడేవాళ్లం కాదు. ఒకవేళ పరిస్థితులను కంట్రోల్ చేయడానికి చర్చలు జరుగుతుంటే.. క్రీడలు మధ్యవర్తిలాగా పనిచేస్తాయి. కానీ ప్రతీదాన్ని ఆపరేషన్ సిందూర్ కు లింకు పెట్టడం సరికాదు.. అంటూ విమర్శలకు దిగారు. 

ALSO READ :  ఇంత బలుపు అవసరమా.. రన్నరప్ చెక్‌ను విసిరికొట్టిన పాకిస్థాన్ కెప్టెన్

మోదీ ట్వీట్ పై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సక్పాల్ విమర్శలకు దిగారు. మోదీ ట్వీట్ తో స్పష్టంగా అర్థమయ్యేదేమంటే.. నేల, నింగి, గాలి, నీరు, ఆటలు.. ఇలా ఏదైనా సరే .. అన్నింటిని రాజకీయాల్లోకి లాగడం.. పోలరైజ్ చేసి లబ్ది పొందటం వాళ్లకు అలవాటుగా మారింది. ఇండియా గెలుపు మనకు గర్వకారణం.. కానీ ఇండియా ఆసియా కప్ గెలవటం ఫస్ట్ టైం కాదు. కనీసం డగ్నిటీ మెయింటైన్ చేయలేని పీఎం ఉన్నందుకు చింతిస్తున్నాను.. అంటూ రియాక్ట్ అయ్యారు.