పదోతరగతి, ఐటీఐతో ఉద్యోగాలు..ఇండియన్ నేవీలో నావల్ సివిలియన్ స్టాఫ్ పోస్టులు.. లాస్ట్ డేట్: జులై 18

పదోతరగతి, ఐటీఐతో ఉద్యోగాలు..ఇండియన్ నేవీలో నావల్ సివిలియన్ స్టాఫ్ పోస్టులు.. లాస్ట్ డేట్: జులై 18

ఇండియన్ నేవీ నావల్ సివిలియన్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 18. 

పోస్టుల సంఖ్య: 1110

పోస్టులు: స్టాఫ్​నర్స్ 01, చార్జ్​మెన్(నేవల్ ఏవియేషన్)  01, చార్జ్​మెన్(అమ్యునిషన్ వర్క్​షాప్) 08, చార్జ్​మెన్ (మెకానిక్) 49, చార్జ్​మెన్ (అమ్యునిషన్ అండ్ ఎక్స్​ప్లోజివ్) 53, చార్జ్​మెన్ (ఎలక్ట్రికల్) 38, చార్జ్​మెన్ (ఎలక్ట్రానిక్స్ అండ్ జీవైఆర్ఓ) 05, చార్జ్​మెన్ (వెపన్ ఎలక్ట్రానిక్స్) 05, చార్జ్​మెన్ (ఇనుస్ట్రుమెంట్) 02, చార్జ్​మెన్ (మెకానికల్) 11, చార్జ్​మెన్ (హీట్ఇంజిన్) 07, చార్జ్​మెన్ (మెకానికల్ సిస్టమ్) 04, చార్జ్​మెన్ (మెటల్) 21..

చార్జ్​మెన్ (షిప్ బిల్డింగ్) 11, చార్జ్​మెన్ (మిల్​వ్రైట్) 05, చార్జ్​మెన్ (అక్సలరీ) 03, చార్జ్​మెన్ (రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ) చార్జ్​మెన్ (మెకట్రానిక్స్) 01, చార్జ్​మెన్ (సివిల్ వర్క్స్) 03, చార్జ్​మెన్ (మెషీన్) 02, చార్జ్​మెన్ (ప్లానింగ్, ప్రొడక్షన్ అండ్ కంట్రోల్) 13, అసిస్టెంట్ ఆర్టిస్ట్ రీటౌచర్ 02, ఫార్మాసిస్ట్ 06, కెమెరామెన్ 01, స్టోర్ సూపరింటెండెంట్(ఆయుధాలు) 08, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 14, ఫైర్​మెన్ 30, స్టోర్ కీపర్ 178, సివిలియన్ మోటర్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) 117, ట్రేడ్స్​మేట్ 207, పెస్ట్ కంట్రోల్​ వర్కర్ 53, భండారీ 01, లేడీ హెల్త్ అడ్వైజర్ 01..

మల్టీ టాస్కింగ్ స్టాఫ్(మినిస్ట్రీయల్) 09, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ ఇండస్ట్రియల్/ వార్డ్ సహల్కా) 81,  మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ ఇండస్ట్రియల్/ డ్రెస్సర్) 02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ ఇండస్ట్రియల్/దోభి) 04, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ ఇండస్ట్రియల్/ మాలి) 06, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ ఇండస్ట్రియల్/ బార్బర్) 04, డ్రాఫ్ట్స్ మాన్ (కన్​స్ట్రక్షన్) 02.

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: కనిష్ట వయసు18 నుంచి 20 ఏండ్లు. గరిష్ట వయసు 25 నుంచి 45 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జులై 05.
లాస్ట్ డేట్: జులై 18. 
అప్లికేషన్ ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థుల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అన్ రిజర్వ్​డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష , మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్ సైట్​లో 
సంప్రదించగలరు.

ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్​లో జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై కావాలంటే అన్ రిజర్వ్​డ్ అభ్యర్థులు 35 శాతం, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ 30 శాతం, ఇతర అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.