ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు.. డిగ్రీ పాసైనోళ్లు అప్లై చేసుకోండి..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అప్రెంటిస్ ఖాళీలు.. డిగ్రీ పాసైనోళ్లు అప్లై చేసుకోండి..

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 20. 

పోస్టుల సంఖ్య:750 
పోస్టులు: తెలంగాణ  09(ఎస్సీ 02, ఎస్టీ 02, ఓబీసీ 02, పీడబ్ల్యూబీడీ 03), ఆంధ్రప్రదేశ్ 15 (ఎస్సీ 10, ఎస్టీ 01, ఓబీసీ 10, అన్ రిజర్వ్ డ్ 1) 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 20 ఏండ్లు.
గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 10. 
లాస్ట్ డేట్: ఆగస్టు 20. 
అప్లికేషన్ ఫీజు: పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.472, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్ల్యూఎస్  అభ్యర్థులకు రూ.944.  
ఆన్​లైన్ ఎగ్జామ్ డేట్: ఆగస్టు 24. 
స్టైఫండ్: నెలకు రూ.15,000 (మెట్రో), రూ.12,000 (అర్బన్), రూ.10,000 
(సెమీ అర్బన్/ రూరల్ )
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్​ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.iob.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

ఎగ్జామ్ ప్యాటర్న్ 

ఆన్​లైన్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. నాలుగు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–1లో జనరల్ అవేర్​నెస్/ ఫైనాన్షియల్ అవేర్​నెస్ 25  ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్  25 ప్రశ్నలు  25 మార్కులకు, జనరల్ అర్థమెటిక్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు, 25 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.