ఐపీఎల్లో ఇంట్రస్టింగ్ మ్యాచ్.. ఢిల్లీ వర్సెస్ గుజరాత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్లో ఇంట్రస్టింగ్ మ్యాచ్.. ఢిల్లీ వర్సెస్ గుజరాత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టులోకి శుభ్ మన్ గిల్, షారూఖ్ ఖాన్ జట్టులోకి రాగా.. కుమార్ కుషాగ్రా, ప్రసీద్ కృష్ణను పక్కన పెట్టేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. గుజరాత్ టాపార్డర్ చాలా బలంగా ఉంది.

కెప్టెన్ గిల్ నిలకడగా ఆడితే, జోస్ బట్లర్ పవర్ ప్లేలో మెరుపులు మెరిపిస్తే బ్యాటింగ్ అదరగొట్టొచ్చు. యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ కూడా తోడైతే గుజరాత్ భారీ టార్గెట్ నిర్దేశించే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరికి తమ రోల్స్ పై స్పష్టత ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

ఇక బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉండటం ప్రత్యర్థులకు సవాల్ విసరనుంది. అన్నీ ఉన్నా అదేదో సామెత చెప్పినట్టు.. గుజరాత్కు ఇప్పటికైతే ఈ సీజన్ పెద్దగా కలిసి రాలేదు. రెండు మ్యాచులు ఆడి రెండూ ఓడింది. ఇక.. గత సీజన్లలో స్టార్ ఆటగాళ్లపై భారీగా ఖర్చు చేసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన ఢిల్లీ.. 2026 సీజన్ కోసం మాత్రం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. ఆడంబరాల కంటే జట్టు అవసరాలకు తగ్గట్టుగా, ప్రతి విభాగంలోనూ సమతూకం ఉండేలా చూసుకుంది. ఫలితంగానే.. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విక్టరీ సాధించింది.

గుజరాత్ టైటాన్స్: బి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్: KL రాహుల్ (WK), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, T నటరాజన్, ముఖేష్ కుమార్