క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్..ఇండియాలోనే ఐపీఎల్ 2024

క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్..ఇండియాలోనే ఐపీఎల్ 2024

ఇండియాలో ఐపీఎల్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మొదలైందంటే చాలు దేశంలో పండగ వాతావారణం నెలకొంటుంది. రెండు నెలలపాటు జరిగే ఈ సంగ్రామం అభిమానులకి పిచ్చ కిక్ ఇస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ కే ఎక్కువ క్రేజ్ ఉందనే మాట వాస్తవం. ఇదిలా ఉండగా.. ఈ సారి సార్వత్రక ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 ను దుబాయ్ లో నిర్వహించాలని నివేదికలు చెప్పుకొచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఐపీఎల్ 2024 మినీ వేలాన్ని దుబాయిలోనే జరిపారు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ భారత్ లోనే జరగనుందని సమాచారం.         

2024 లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహిస్తారని.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నుండి ఒక మూలం తెలిపింది. ఐపీఎల్ భారత్‌లోనే జరుగుతుందని బీసీసీఐ విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. టోర్నమెంట్‌ను దేశం వెలుపలికి మార్చే ఆలోచన లేదు. సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ సమయంలోనే జరుగుతాయి. ఆ సమయంలో మ్యాచ్‌లను నిర్వహించకపోవడానికి ఏదైనా రాష్ట్రానికి సరైన కారణాలు ఉంటే, మ్యాచ్‌లను మరొక వేదికకు తరలించవచ్చు. అని BCCI నుంచి ఒక వర్గం ANIకి తెలిపింది.

ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మార్చ్ 22 అని వార్తలు వస్తున్నా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జూన్ 1 నుంచి వెస్టిండీస్,అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మే 20 లోపు ఈ మెగా టోర్నీని ముగించే అవకాశం ఉంది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన IPL 2024 వేలం తర్వాత ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లని ఖరారు చేశాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా రూ. 24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ కోట్లకు కొనుగోలు చేసింది.