గుడ్ న్యూస్: ఈ రూట్లలో వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ ల సంఖ్య పెరిగింది.. !

గుడ్ న్యూస్: ఈ రూట్లలో వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ ల సంఖ్య పెరిగింది.. !

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్ ల సంఖ్యను పెంచింది రైల్వే శాఖ. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పాలి. ప్రస్తుతం మూడు రూట్లలో 16 కోచ్‌లతో, నాలుగు మార్గాల్లో 8 కోచ్‌లతో వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. 16 కోచ్‌ల రైళ్లు 20 కోచ్‌లకు, 8 కోచ్‌ల రైళ్లు 16 కోచ్‌లకు పెంచనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ.

మంగళూరు సెంట్రల్‌-తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-తిరునల్వేలి, సికింద్రాబాద్‌-తిరుపతి మార్గాల్లో 16 కోచ్ లతో వందేభారత్‌ రైళ్లు  ఇప్పటికే నడుస్తుండగా.. వీటిని త్వరలో 20 కోచ్‌లకు పెంచాలని నిర్ణయించింది రైల్వే శాఖ. మిగతా నాలుగు రూట్లలో 8 కోచ్‌లతో వందేభారత్‌లు నడుస్తుండగా.. వాటిని 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

కోచ్ ల సంఖ్య పెరగనున్న వందే భారత్ రైళ్లు ఇవే:

  • సికింద్రాబాద్‌-తిరుపతి
  • మంగళూరు సెంట్రల్‌-తిరువనంతపురం
  • చెన్నై ఎగ్మోర్‌-తిరునల్వేలి
  • మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌
  • దేవ్‌గఢ్‌-వారణాసి
  • హవ్‌డా-రౌర్కెలా
  • ఇందౌర్‌-నాగ్‌పూర్‌

అంతే కాకుండా.. రానున్న రోజుల్లో కొత్తగా 20 కోచ్ ల వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ.కొత్త 8, 16 కోచ్‌ల రైళ్లు మరో కొత్త మార్గాల్లో నడవనున్నాయని తెలిపింది రైల్వే శాఖ.