భారత స్టాక్ మార్కెట్లలో పెద్ద భూకంపం వచ్చింది. కొత్త వారం మెుదటి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహలకు కూడా అందనంత భారీ పతనాన్ని నమోదు చేశాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2460 పాయింట్లు నష్టపోగా, మరో సూచీ నిఫ్టీ 726 పాయింట్ల నష్టంలోకి జారుకున్నాయి ఓపెన్ అని 10 నిమిషాల్లోనే. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 2440 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1912 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతున్నాయి ఉదయం 9.28 గంటల సమయంలో. దీంతో ఇన్వెస్టర్ల సంపద నిమిషాల్లోనే దాదాపు రూ.15 లక్షల కోట్లు ఆవిరైపోయింది ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఇవాళ.
ఇరాన్ యుద్ధం ప్రపంచం ఊహించినదాని కంటే భిన్నంగా ముందుకు సాగుతున్న వేళ ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి రోజురోజుకూ. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లు దాదాపు 10 శాతం వరకూ నష్టపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లు కూడా ప్రస్తుత పరిస్థితులతో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల కారణంగా ట్రేడింగ్ నిలిపివేతను ఎదుర్కొంటున్నాయి.
అసలు నేడు మార్కెట్లు ఇంత భారీగా రియాక్ట్ కావటానికి అసలు కారణంగా క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ధర ఏకంగా 115 డాలర్లకు బ్యారెల్ కి చేరుకోవటమే. ఈ భారీ రేట్ల పెంపు ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి ఆర్థిక పరిస్థితులను దిగజార్చుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భారత్ లాంటి క్రూడ్ దిగుమతిదారులకు ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఈ పరిస్థితులతో సామాన్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ఆయిల్ ఖర్చులను ప్రభుత్వం నేరుగా ప్రజలకు పాసాన్ చేసే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
