అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

న్యూయార్క్: ఓ వృద్ధురాలిని మోసం చేసేందుకు ప్రయత్నించిన భారతీయ విద్యార్థిని అమెరికాలో పోలీసులు అరెస్ట్​ చేశారు. 21 ఏండ్ల కిషన్ కుమార్ సింగ్‌‌‌‌.. 2024 నుంచి స్టూడెంట్ వీసాపై ఒహియోలో ఉంటున్నాడు. స్టోక్స్‌‌‌‌డేల్​లో నివసించే 78 ఏండ్ల వృద్ధురాలికి ఫోన్ చేసి మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఫెడరల్ అధికారినని చెబుతూ, ఆమె బ్యాంకు ఖాతా ఒక క్రైంలో భాగమైందని భయపెట్టాడు. 

తక్షణమే డబ్బు విత్‌‌‌‌డ్రా చేసి, భద్రత కోసం తమకు అందజేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. గత గురువారం పోలీసు యూనిఫాం ధరించి డబ్బు తీసుకోవడానికి వృద్ధురాలి ఇంటికి చేరుకున్న కిషన్ కుమార్ సింగ్​ను పోలీసులు అరెస్టు చేశారు.