17వ సిరీస్‌‌‌‌ పట్టేస్తారా?.. ఇవాల్టి నుంచి ఇంగ్లండ్‌‌‌‌తో ఇండియా నాలుగో టెస్ట్‌‌‌‌

17వ సిరీస్‌‌‌‌ పట్టేస్తారా?.. ఇవాల్టి నుంచి ఇంగ్లండ్‌‌‌‌తో ఇండియా నాలుగో టెస్ట్‌‌‌‌

రాంచీ: సొంత గడ్డపై వరుసగా 17వ టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ విజయంపై కన్నేసిన ఇండియా టీమ్‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌తో నాలుగో టెస్ట్‌‌‌‌కు రెడీ అయ్యింది. నేటి నుంచి జరిగే ఈ పోరులో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 2–1 లీడ్‌‌‌‌లో ఉన్న రోహిత్‌‌‌‌సేన ఇక్కడే సిరీస్‌‌‌‌ పట్టేయాలని భావిస్తుండగా, లెక్క సరిచేయాలని ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు జట్లకు ఈ మ్యాచ్‌‌‌‌ కీలకం కానుంది. అదే టైమ్‌‌‌‌లో 2012 నుంచి వరుసగా 16 సిరీస్‌‌‌‌లు నెగ్గి జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా 47 టెస్ట్‌‌‌‌ల్లో 38 విజయాలు సాధించింది. మూడింటిలో (ఆసీస్‌‌‌‌ చేతిలో 2, ఇంగ్లండ్‌‌‌‌ చేతిలో ఒకటి) ఓడింది. ఈ నేపథ్యంలో రికార్డులో ఏమాత్రం తేడా రాకుండా రాంచీలోనే 17వ సిరీస్‌‌‌‌ను కూడా పట్టేయాలని  ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే మూడు, ఐదో రోజు వర్షం పడొచ్చు. 

ముకేశ్‌‌‌‌ X  ఆకాశ్‌‌‌‌

ఈ మ్యాచ్‌‌‌‌ కోసం టీమిండియా ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో పెద్ద మార్పులు చేయలేదు. స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రాకు రెస్ట్‌‌‌‌ ఇవ్వడంతో అతని ప్లేస్‌‌‌‌లో ఎవర్ని తీసుకోవాలనే దానిపై చర్చ నడుస్తున్నది. రంజీల్లో 10 వికెట్ల హాల్‌‌‌‌ సాధించిన ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ను తీసుకుంటారా? లేక ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌కు అరంగేట్రం చాన్స్‌‌‌‌ ఇస్తారా? చూడాలి. సిరాజ్‌‌‌‌కు తోడుగా ఈ ఇద్దరిలో ఒకరికే చాన్స్‌‌‌‌ దక్కనుంది.

రాంచీ పిచ్‌‌‌‌ స్పిన్‌‌‌‌కు ఎక్కువ అనుకూలమని తేలడంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనున్నారు. జడేజా, అశ్విన్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ను కంటిన్యూ చేయనున్నారు. వరుస డబుల్‌‌‌‌ సెంచరీలతో ఫామ్‌‌‌‌లో ఉన్న యశస్వి, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ మరోసారి కీలకం కానున్నారు. కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ అండగా నిలబడితే భారీ స్కోరు ఖాయం. రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. ఓవరాల్‌‌‌‌గా కుర్రాళ్ల బ్యాటింగ్‌‌‌‌పైనే ఇండియా విజయం ఎక్కువగా ఆధారపడి ఉంది. 

బషీర్‌‌‌‌, హార్ట్‌‌‌‌లీ ఆగయా..

ఈ మ్యాచ్‌‌‌‌లో ఓడితే సిరీస్‌‌‌‌ కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఇంగ్లండ్‌‌‌‌ కూడా గెలుపే లక్ష్యంగా దిగుతోంది. పిచ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్‌‌‌‌ షోయబ్‌‌‌‌ బషీర్‌‌‌‌, టామ్‌‌‌‌ హర్ట్‌‌‌‌లీని తుది జట్టులోకి తీసుకుంది. స్పిన్నర్‌‌‌‌గా రూట్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. పేసర్​ అండర్సన్​కు తోడుగా మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ను తప్పించి ఓలీ రాబిన్సన్‌‌‌‌ను తీసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌‌‌‌లో ఎక్కువగా బ్యాటింగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ చేశారు. క్రాలీ, డకెట్‌‌‌‌, పోప్‌‌‌‌ భారీ రన్స్‌‌‌‌ చేయాలని పట్టుదలగా ఉన్నారు. మిడిలార్డర్‌‌‌‌లో రూట్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, స్టోక్స్‌‌‌‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియా స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోవాలంటే వీళ్లు ఎక్కువసేపు క్రీజులో పాతుకుపోవాలి. 

జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), యశస్వి, గిల్‌‌‌‌, రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌, ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌, జడేజా, అశ్విన్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, ముకేశ్‌‌‌‌/ ఆకాశ్‌‌‌‌ దీప్‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌: బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), క్రాలీ, డకెట్‌‌‌‌, ఓలీ పోప్‌‌‌‌, రూట్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, బెన్‌‌‌‌ ఫోక్స్‌‌‌‌, హర్ట్‌‌‌‌లీ, ఓలీ రాబిన్సన్‌‌‌‌, అండర్సన్‌‌‌‌, షోయబ్‌‌‌‌ బషీర్‌‌‌‌. 

   టెస్ట్‌‌‌‌ల్లో 4 వేల రన్స్‌‌‌‌ చేయడానికి రోహిత్‌‌‌‌ చేయాల్సిన రన్స్‌‌‌‌. 

అండర్సన్‌‌‌‌ మరో నాలుగు వికెట్లు తీస్తే   700 క్లబ్‌‌‌‌లో చేరతాడు. మురళీధరన్‌‌‌‌ (800), షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ (708) ముందున్నారు.