ఇండియన్ వెల్స్ (అమెరికా): ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ భాంబ్రీ పోరాటం ముగిసింది. స్వీడన్ పార్ట్‌నర్ ఆండ్రీ గోరాన్సన్‌తో కలిసి సెమీ ఫైనల్లో అడుగుపెట్టి రికార్డు సృష్టించిన భాంబ్రీ ఫైనల్ చేరలేకపోయాడు.
శనివారం జరిగిన సెమీస్‌లో అన్‌సీడెడ్ భాంబ్రీ–- గోరాన్సన్ ద్వయం 5–-7, 7–-6(7/3), 5–-10 తేడాతో ఆర్థర్ రిండర్‌క్నెచ్ (ఫ్రాన్స్)– వాలెంటిన్ వాచెరోట్ (మొనాకో) చేతిలో పోరాడి ఓడిపోయింది. 33 ఏండ్ల భాంబ్రీ తన కెరీర్‌లో ఓ మాస్టర్స్ 1000 ఈవెంట్‌లో సెమీస్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మరోవైపు విమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ అరీనా సబలెంకా (బెలారస్)6–-3, 6–-4తో లిండా నోస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. మరో సెమీస్‌లో రిబకినా (కజకిస్తాన్) 7–5, 6–4తో స్వితోలినా (ఉక్రెయిన్)ను ఓడించింది.
