మహిళల టేబుల్ టెన్నిస్లో.. భారత్ దూకుడు

 మహిళల టేబుల్ టెన్నిస్లో.. భారత్ దూకుడు

భారత జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన ఇండియా టీమ్.. ఇవాళ  మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం మధ్యాహ్నం జరిగిన టేబుల్ టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ లో గుయానా జట్టును  3-0 పాయింట్ల తేడాతో భారత్ ఓడించింది.

శ్రీజ ఆకుల, రీత్ టెన్నిసన్ లతో కూడిన భారత టీమ్ చేతిలో గుయానా టీమ్ (నటాలీ కమింగ్స్, చెల్సీ ఎడ్గ్ హిల్) చిత్తుగా ఓడిపోయింది.  మ్యాచ్ లో మొదటి నుంచీ భారత్ దే పైచేయిగా కొనసాగింది. మొదటి సెట్ ను 11-5 పాయింట్లతో, రెండు, మూడో సెట్లను 11-7 పాయింట్లతో భారత్  కైవసం చేసుకుంది.

కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా బోణీ కొట్టింది. మన దేశానికి తొలి మెడల్ ను మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ సాధించిపెట్టారు. 55 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆయన రజత పతకం (సిల్వర్ మెడల్) కైవసం చేసుకున్నారు. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆయన రెండు రౌండ్లలో మొత్తం 248 కేజీల (113 కేజీలు + 135 కేజీలు) బరువును ఎత్తి రజత పతకాన్ని చేజిక్కించుకున్నారు. వాస్తవానికి సంకేత్ బంగారు పతకాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడ్డాయి. అయితే రెండో రౌండ్ లో 138 కేజీల బరువును ఎత్తే క్రమంలో సంకేత్ కుడి మోచేయికి గాయమైంది. దీంతో ఆయన 138 కేజీలకుగానూ 135 కేజీల బరువునే ఎత్తగలిగారు.