ఇంగ్లాండ్పై భారత మహిళల జట్టు విజయం సాధించింది. తొలి టీ20లో ఓడిన టీమిండియా..రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచి..సిరీస్ను సమం చేసింది. ఇంగ్లాండ్ విసిరిన 143 పరుగుల టార్గెట్ను భారత ఉమెన్స్ టీమ్..కేవలం 2 వికెట్లు కో ల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది.
A Player of the Match performance from Smriti Mandhana helped India level the series with an emphatic victory over England.#ENGvIND pic.twitter.com/lSyqQZmj23
— ICC (@ICC) September 13, 2022
ఇంగ్లాండ్ బ్యాటర్ రికార్డు..
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్..20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. ఐదో నెంబర్లో వచ్చిన ఫ్రెయా కెంప్ జట్టును ఆదుకుంది. సిక్సులు ఫోర్లతో రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే 37 బంతుల్లోనే 51 పరుగులు చేసింది. తద్వారా టీ20ల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా 17 ఏళ్ల ఫ్రెయా కెంప్ నిలిచింది. కెంప్కు బౌచర్ 34 పరుగులు చేసి సహకరించింది.
స్మృతి సూపర్ ఇన్నింగ్స్..
టార్గెట్ ఛేజింగ్లో ఓపెనర్లు మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే 20 పరుగులు చేసిన షఫాలీ..ఎక్లెస్టోన్ బౌలింగ్లో పెవీలియన్ చేరింది. ఆ తర్వాత వచ్చిన దయాళన్ హేమలత త్వరగానే ఔటయింది. ఓ వైప్ వికెట్లు పడుతున్నా..స్మృతి మంధాన చెలరేగింది. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు (79నాటౌట్ 13ఫోర్లు) ఆజేయంగా నిలిచి భారత్ ను గెలిపింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 29 పరుగులతో సహకారం అందించింది.
