పుష్ప మూవీలోని తగ్గేదే లే డైలాగ్ ని ఇమిటేట్ చేసిన రెజ్లర్

పుష్ప మూవీలోని తగ్గేదే లే డైలాగ్ ని ఇమిటేట్ చేసిన రెజ్లర్

పుష్ప సినిమా తర్వాత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరిగిపోయిది. రోజు రోజుకూ ఆ సినిమాకు, అందులోని డైలాగులు, యాక్షన్స్ కు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇప్పటికే తన స్టైల్ తో, యాక్టింగ్ తో, డ్యాన్సులతో అదరగొడుతున్న బన్నీ... ఈ సినిమాతో తిరుగులేని స్టార్ హీరోగా మారాడు. అయితే పుష్ప పార్ట్ 1లో అత్యంత ఆదరణను సొంతం చేసుకున్న తగ్గేదే లే అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్ ను బేస్ చేసుకొని ఫిల్మ్ స్టార్స్ తో పాటు, మరికొందరు క్రీడాకారులు సైతం ఆ మ్యానరిజంను అనుసరిస్తూ... సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు.

అయితే సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ వేత్తల వరకూ చేరిన పుష్ప మేనియా.. ఆ సినిమా రిలీజై ఆర్నెళ్లు అవుతున్నా.. ఇంకా తగ్గడం లేదు. ఆ మూవీలోని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ కూడా చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రెజ్లింగ్ స్టేడియంలోనూ హల్ చల్ చేసింది. ఇండియాకు చెందిన ప్రముఖ రెజ్లర్ సౌరవ్ గుజ్లర్.. WWE(World Wrestling Entertainment)లో భాగంగా తన ప్రత్యర్థిని ఓడించిన ఆనందంలో తగ్గేదే లే అనే మ్యానరిజాన్ని ఇమిటేట్ చేశాడు. దీంతో దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్ని రోజులైనా పుష్ప మూవీకి క్రేజ్ తగ్గట్లేదనడానికి ఇదే నిదర్శనమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.