ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వాలిఫికేషన్రౌండ్ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరుకున్నాడు.
World Athletics Championships: Neeraj Chopra qualifies for final with 88.39m throw in first attempt
— ANI Digital (@ani_digital) July 22, 2022
Read @ANI Story | https://t.co/q2eFFn3qFz#WorldAthleticsChampionships2022 #NeerajChopra pic.twitter.com/vl7eile5VN
ఇటీవలే స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి జాతీయ రికార్డు సృష్టించాడు. అయితే.. 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్లో నీరజ్ ఎంత దూరం వరకు జావెలిన్‌ను విసురుతాడనేది ఆసక్తికరంగా మారింది.