5 ఏళ్లలో 38 వేల కోట్లు టార్గెట్

5 ఏళ్లలో 38 వేల కోట్లు టార్గెట్

న్యూఢిల్లీ: యాపిల్​ ఐఫోన్​ ప్రొడక్షన్​కు బూస్ట్​ ఇచ్చేందుకు ఎలక్ట్రానిక్స్​ మాన్యుఫాక్చరింగ్​ సర్వీసెస్​ కంపెనీ ఆప్టిమస్​ ఎలక్ట్రానిక్స్​ యాపిల్​ కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్​ విస్ట్రన్​తో పార్ట్​నర్షిప్​ కుదుర్చుకుంది. మొబైల్​ డివైస్​లు, టెలికం గేర్ల  ప్రొడక్షన్​ పెంచేందుకు రూ. 1,350 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆప్టిమస్​ వెల్లడించింది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో రూ. 38 వేల కోట్ల రెవెన్యూను టార్గెట్​గా పెట్టుకుంటున్నామని, కొత్తగా 11 వేల ఉద్యోగాలు క్రియేట్​ చేయాలనుకుంటున్నామని  ఆప్టిమస్​ చైర్మన్​ అశోక్​ కుమార్​ గుప్తా చెప్పారు. పీఎల్​ఐ స్కీము కింద అర్హత పొందిన కంపెనీలలో ఆప్టిమస్​ కూడా ఒకటి. గ్రోత్​తో పాటే ఇన్వెస్ట్​మెంట్​ పెంచుతామని గుప్తా పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడా వద్ద కంపెనీకి రెండు మాన్యుఫాక్చరింగ్​ యూనిట్లున్నాయి. వీటికి నెలకు 20 లక్షల మొబైల్​ డివైస్​లు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. ఎలక్ట్రానిక్స్​కు డిమాండ్​ పెరుగుతోందని, పీఎల్​ఐ స్కీముతో దేశంలో తయారీ జోరందుకుంటుందని గుప్తా పేర్కొన్నారు. 5 జీ మొబైల్స్​, ఐటీ హార్డ్​వేర్​ నోట్​బుక్​, డెస్క్​టాప్​, క్లౌడ్​ కంప్యూటింగ్​ రంగాలలో ఇండియాకు మంచి అవకాశాలున్నాయని విస్ట్రన్​ ప్రెసిడెంట్​ డేవిడ్​ చెన్​ చెప్పారు. ఎలక్ట్రానిక్​ వెహికల్​ తయారీ రంగంలోకి త్వరలో అడుగుపెట్టనున్నామని, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ బేస్డ్​ ఐఓటీలోకి ప్రవేశిస్తామని పేర్కొన్నారు. ప్రొడక్ట్​ డెవలప్​మెంట్​లోనూ ఆప్టిమస్​, విస్ట్రన్​ కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి.