పోయిన నెలలో 13.31% పెరిగిన కరెంటు వాడకం

పోయిన నెలలో 13.31% పెరిగిన కరెంటు వాడకం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరెంటు వాడకం (ఏడాది లెక్కన) పోయిన నెల 13.31 శాతం పెరిగి 127.39 బిలియన్ యూనిట్లకు (బీయూ) చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇది11.65 శాతం పెరిగింది.  కోవిడ్​ లాక్‌‌డౌన్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని వాడకంలో రెండంకెల వృద్ధి సాధ్యమయిందని ఎక్స్పర్టులు తెలిపారు. పండుగల సీజన్​కుతోడు  ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం వల్ల  కరెంటు వాడకం కూడా పెరుగుతుంది. పోయిన ఏడాది సెప్టెంబరులో కరెంటు వాడకం 112.43 బీయూలుగా నమోదైంది. 2020 సెప్టెంబరులో వాడకం 112.24 బీయూల కంటే ఎక్కువని కరెంటు మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది.

2022 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కరెంటు వాడకం 11.65 శాతం పెరిగి 786.5 బీయూలకు, 2021లో అదే కాలంలో 740.40 బీయూలకు చేరింది.  2020 ఏప్రిల్–-సెప్టెంబర్ 2020లో కరెంటు వాడకం 625.33 బీయూలుగా ఉంది. 2022 సెప్టెంబరులో ఒక రోజులో గరిష్ట కరెంటు డిమాండ్ 199.47 గిగావాట్లకు  పెరిగింది. 2021 సెప్టెంబరులో మ్యాగ్జిమమ్​ కరెంటు సప్లై 180.73 గిగావాట్లు కాగా,  సెప్టెంబర్ 2020లో 176.41 గిగావాట్లు. 2019 సెప్టెంబరు లో గరిష్ట కరెంటు డిమాండ్ 173.14 గిగావాట్లుగా ఉంది (కోవిడ్​కు ముందు కాలం). ఇక 2019 సెప్టెంబర్ లో కరెంటు వాడకం 107.51 బిలియన్​ యూనిట్లుగా ఉంది.