V6 News

పవర్ ట్రాన్స్ మిషన్ సెక్టార్ లో బూమ్..2032 వరకు 9లక్షల కోట్ల క్యాపెక్స్ అంచనా

పవర్ ట్రాన్స్ మిషన్  సెక్టార్ లో బూమ్..2032 వరకు 9లక్షల కోట్ల క్యాపెక్స్ అంచనా
  • ట్రాన్స్ ఫార్మర్లకు మస్తు గిరాకీ..
  • 2032 నాటికి పవర్ ట్రాన్స్ మిషన్ సెక్టార్ కు రూ.9 లక్షల కోట్లు
  • ట్రాన్స్ ఫార్మర్లకు భారీ గిరాకీ
  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ అవకాశాలు
  • మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిపోర్ట్

న్యూఢిల్లీ:పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) కంపెనీలకు నిధుల వర్షం కురవబోతోం ది. విద్యుత్పంపిణీ రంగం నిలకడైన వృద్ధితో సాగుతుండటంతో మూలధన వ్యయం భారీగా ఉంటుందని వెల్లడయింది. గత కొన్నేళ్లలో ప్రభు త్వం 18,374 గ్రామాల విద్యుదీకరణ, 2.86 కోట్ల ఇండ్లకు కరెంటు కనెక్షన్లు అందిండానికి సుమారు రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. 

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం.. 2032 వరకు ఈ రంగానికి మూలధన వ్యయం రూపంలో రూ.తొమ్మిది లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆర్థ ర్ల ప్రక్రియ కాస్త నెమ్మదించినప్పటికీ భవిష్యత్తుపై ధీమా వ్యక్తమవుతోంది. టీ అండ్ డీ విలువగొలుసు 2032 వరకు రూ.తొమ్మిది లక్షల కోట్ల భారీ కేటా యింపుల నుంచి ప్రయోజనం పొందుతుంది. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ క్యాపెక్స్ సైకిల్ అప్పటికే కంపెనీల ఆర్డర్ బుక్స్, ఆదాయం. లాభాల మార్జిన్లలో గణనీయమైన వృద్ధిని తెచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో 45 పథకాలకు ఆర్డర్లు లభించగా, 2026 ఆర్థిక సంవత్సరంలో కేవలం 16 పథకాలకే కేటాయింపులు జరిగాయి. ఇది కొన్ని తాత్కాలిక ఇబ్బందుల వల్ల జరిగిన మార్పే తప్ప డిమాండ్ తగ్గడం వల్ల కాదని రిపోర్ట్ స్పష్టం చేసింది.

పెరిగిన డిమాండ్

దేశీయ కంపెనీలు ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. హై వోల్టేజ్ ట్రాన్స్ ఫార్మర్ల తయారీపై దృష్టి పెడుతున్నాయి. దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా బలమైన డిమాండ్ వస్తోంది. జాతీయ విద్యుత్ ప్రణాళికలో భాగంగా పునరుత్పాదక ఇంధన అనుసంధానంకోసం ట్రాన్స్ మిషన్ రంగంలో రూ.తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. 

దీనివల్ల గత కొన్నేళ్లుగా ఆర్డర్లసంఖ్య పెరిగింది. సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటం తయారీదారులకు కలిసి వచ్చే అంశం. అమెరికా, యూరప్ దేశాల్లో ట్రాన్స్ ఫార్మర్లకు భారీ డిమాండ్ ఉంది. పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్ల విస్తరణ, పారిశ్రామిక విద్యుదీకరణ, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక సదుపాయాల పెరు గుదల ఇందుకు ప్రధాన కారణాలు. 

పాత మౌలిక సదుపాయాలను మార్చాల్సిన అవసరం రావడంతోడిమాండ్కు తగ్గ సరఫరా లేక ధరలు పెరుగుతు న్నాయి. ఇది భారతీయ కంపెనీలకు గొప్ప అవకా శంగా మారింది. గ్లోబల్ ఓఈఎం, ఫీడర్ ఫ్యాక్టరీ నెట్వర్క్లో మనదేశం కీలక తయారీకేంద్రంగా ఎదుగుతోంది.

హెచ్ వీడీసీ ప్రాజెక్టుల్లోనూ అవకాశాలు

హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (హెచ్పీడీసీ) ప్రాజెక్టుల్లోనూ కొత్త అవకాశాలు వస్తున్నాయి. మొత్తం 32.3 గిగావాట్ల పైప్లైన్లో ఇప్పటికే 14.5 గిగావాట్ల పనులకు టెండర్లు పూర్తి కాగా కేటాయింపులు కూడా జరిగాయి. ఇకపై ఏటా ఒకటి లేదా రెండు హెచ్పీడీసీ అవార్డులు వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్ అంచనా వేసింది. 2025 నుంచి 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య ట్రాన్స్ ఫార్మర్ కంపెనీలు బలమైన ఆదాయ వృద్ధిని సాధిస్తాయని పేర్కొంది. ఎగుమతి అవకాశాలు మెరుగుపడటం వల్ల పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగే అవకాశం ఉంది.